బుర‌ఖా వేసుకోవ‌డ‌మే ఆమె చేసిన పొర‌పాటు!

కొన్ని దేశాల్లో ముస్లింల‌పై ఇప్ప‌టికీ కొన‌సాగుతున్న వివ‌క్ష‌కు నిద‌ర్శ‌నం ఈ ఘ‌ట‌న‌. అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ముస్లిం సంప్ర‌దాయం ప్ర‌కారం..బుర‌ఖా ధ‌రించి రెస్టారెంట్‌కు వెళ్ల‌డ‌మే ఆమె చేసిన పొర‌పాటైంది. బుర‌ఖా ధ‌రించి ఉండ‌టంతో ముస్లింగా గుర్తించిన ఆ రెస్టారెంట్ య‌జ‌మానిపై ఆ మ‌హిళ‌పై జాతి వివ‌క్ష‌ను చూపాడు.

ఆమెకు ఆహారాన్ని అందించ‌డానికి నిరాక‌రించాడు. `మీ (ముస్లిం) చేతుల్లో చావ‌డానికి నేను సిద్ధంగా లేను..` అంటూ జాత్య‌హంకారాన్ని ప్ర‌ద‌ర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ నెల 12వ తేదీన ఓ ముస్లిం మ‌హిళ బుర‌ఖాను ధ‌రించి కాలిఫోర్నియాలోని కాఫీ బీన్ అండ్ టీ లీఫ్ రెస్టారెంట్‌కు వెళ్లారు.

ఆర్డ‌ర్ ఇవ్వ‌బోతుండ‌గా.. అక్క‌డి సిబ్బంది ఆమెను ఎద్దేవా చేశాడు. `మీ మ‌తం అంటే నాకు న‌చ్చ‌దు. మీ చేతుల్లో చావ‌డానికి నేను సిద్ధంగా లేను. ఇడియ‌ట్స్‌తో మాట్లాడ‌టానికి నాకు ఇష్టం ఉండ‌దు..` అంటూ చుల‌క‌న చేశాడు. సీజె వెర్లెమెన్ అనే వ్య‌క్తి ఈ త‌తంగాన్ని వీడియో తీశారు. సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. వారిద్ద‌రి మ‌ధ్య చోటు చేసుకున్న సంభాష‌ణ‌కు సంబంధించిన రెండు లైన్ల‌ను రాశాడు. దీనిపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here