మీ అరచేతుల్లో ఇలాంటి బుడిపె క‌నిపిస్తోందా? డాక్ట‌ర్ వ‌ద్ద‌కు ప‌రుగెత్తాల్సిందే!

ఒట్టావా: మీ అర‌చేతుల్లో పొర‌పాటున గానీ ఇలాంటి బుడిపె గానీ క‌నిపిస్తే..అర్జంట్‌గా డాక్ట‌ర్ వ‌ద్ద‌కు ప‌రుగెత్తాల్సిందే. శ‌రీరంలో నిక్షిప్త‌మైన ఉన్న ప్రాణాంత‌క రోగాల‌కు అది నిద‌ర్శ‌న‌మ‌ట‌. గుండె, కాలేయం, కిడ్నీ, క‌ళ్లు.. వంటి సున్నిత భాగాలు ప‌నితీరు విఫ‌లం చెందాయ‌న‌డానికి నిద‌ర్శ‌నంగా ఇవి ఏర్ప‌డతాయ‌ని `ది న్యూ ఇంగ్లండ్ జ‌ర్న‌ల్ ఆఫ్ మెడిసిన్‌` వెల్ల‌డించింది.

ఇలాంటి బుడిపెను ఉన్న 27 సంవ‌త్స‌రాల రాబ‌ర్ట్ అనే వ్య‌క్తి ఒక‌రు ఆసుప‌త్రికి వెళ్ల‌గా.. అత‌ణ్ని ప‌రీక్షించిన స‌మ‌యంలో ఈ విష‌యం వెల్ల‌డైన‌ట్లు కెన‌డా డాక్ట‌ర్లు తెలిపారు. ఈ విష‌యాన్ని వారు జ‌ర్న‌ల్ ఆఫ్ మెడిస‌న్‌లో ప్రచురించారు. అర‌చేతుల్లో మొద‌ట ఎర్ర‌టి బొబ్బ‌లాగా ఏర్ప‌డుతుందని, క్ర‌మంగా అది నీలంరంగులోకి మారుతుంద‌ని కెన‌డా డాక్ట‌ర్లు తెలిపారు.

మొద‌ట ఆ వ్య‌క్తి దంత సంబంధ వ్యాధితో త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చాడ‌ని, ఆ స‌మ‌యంలో అత‌ని అర‌చేతిపై ఈ బుడిపెను చూశామ‌ని అన్నారు. ఆ స‌మ‌యంలో అత‌ణ్ని ప‌రీక్షించ‌గా అత‌ని గుండెకు ఇన్‌ఫెక్ష‌న్ సోకిన‌ట్టు గుర్తించారు. నాణ్య‌త లేని ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల ఇలాంటి ఇబ్బందులొస్తాయ‌ట‌.

నాణ్య‌త లేని ఆహారాన్ని తీసుకున్న స‌మ‌యంలో అందులోని క్రిములు ర‌క్తంలో క‌లిసిపోతాయ‌ని, ర‌క్త‌ప్రస‌ర‌ణ‌లో భాగంగా.. అవి క‌వాటాల గుండా గుండెకు చేరి, అక్క‌డే తిష్ట వేస్తాయని వెల్ల‌డించారు.

ఫ‌లితంగా- గుండె ఇన్‌ఫెక్ష‌న్ బారిన ప‌డుతుంద‌ని అన్నారు. ఈ ప‌రిస్థితి గుండెతోపాటు కాలేయం, కిడ్నీ ఇత‌ర సున్నిత భాగాలు కూడా ఎదుర్కొంటాయ‌ని తెలిపారు. రాబ‌ర్ట్ విష‌యంలో అత‌ని గుండెకు ఇన్‌ఫెక్ష‌న్ సోకిన‌ట్టు చెప్పారు. ప్ర‌స్తుతం అత‌నికి చికిత్స అందిస్తున్నామ‌ని అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here