ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమ్ ఇస్తున్నాడు.. ఇంతలో..!

స్నేహితులతో కలిసి ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమ్ ఇస్తున్నాడు. ఇంతలో పక్కనే ఉన్న యువతి అక్కడ ఉన్న గన్ ను తీసుకొని లోడ్ చేసింది. సరదాగా ఉన్నారని అనుకునేలోపే ఆమె గన్ ట్రిగర్ ను నొక్కేసింది. ఇంకేముంది క్షణాల్లో అతడి తల నుండి రక్తం ధారాళంగా కారిపోయింది. వెంటనే ఆమెతో పాటూ కారులో ఉన్న మరో వ్యక్తి అక్కడి నుండి పారిపోయాడు.

ఈ ఘటన టెక్సాస్ లోని హ్యూస్టన్ లో చోటుచేసుకుంది. డెవిన్ హోమ్స్ అనే వ్యక్తి తల లోకి లైవ్ స్ట్రీమింగ్ లో ఉండగా తూటా దూసుకువెళ్ళింది. ఆ లైవ్ వీడియోను ఇప్పటికే వేలమంది చూశారు. ప్రస్తుతం అతడు ఐసీయులో ఉన్నాడు. కసాండ్రా డ్యాంపర్ అనే 25 ఏళ్ల యువతి అతన్ని షూట్ చేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆమె పారిపోవాలని ప్రయత్నించింది. కానీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. డెవిన్ ను బెన్ తౌబ్ ఆసుపత్రికి తీసుకొనివెళ్ళారు. అతడి పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్ గా ఉందని వైద్యులు అంటున్నారు. కసాండ్రా ఈ ఘటన జరిగిన వెంటనే ఆ గన్ మీద ఉన్న వేలిముద్రలను తుడిచేయడానికి ప్రయత్నించింది. తనకు ఆ గన్ లోడ్ అయిందని.. అందులో బులెట్లు ఉన్నాయని అసలు తెలియదని ఆమె పోలీసులతో చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here