దుబాయ్ లో సూపర్ వైజర్ లైంగికంగా వేధింస్తున్నాడని.. పొడిచి చంపేశాడు.. అతడికి ఏ శిక్ష విధించారంటే..!

దుబాయ్ లో ఓ వర్కర్ ను చాలా రోజులుగా అతడి మేనేజర్ ఏడిపించేవాడు.. అతడిని లైంగికంగా వేధించేవాడు.. ఇష్టం వచ్చినట్లు తిట్టేవాడు. దీంతో ఆ యువకుడికి తన మేనేజర్ పై చాలా కోపం వచ్చింది. ఓ కత్తి తీసుకొని అతన్ని అతి కిరాతకంగా చంపేశాడు. ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో అతనికి దుబాయ్ కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. అలాగే శిక్షాకాలం ముగిసిన వెంటనే అతని దేశానికి పంపించేయనుంది.

22 సంవత్సరాల పాకిస్థానీ యువకుడు ఓ పనిలో చేరాడు. అయితే అతడి సూపర్ వైజర్ అతన్ని తిట్టేవాడట.. అలాగే పలుమార్లు లైంగికంగా వేధించేవాడని నిందితుడు కోర్టులో తెలిపాడు. దీంతో తాను అతడ మీద దాడి చేశానని చెప్పుకొచ్చాడు. మొత్తం అతడి శరీరం మీద నాలుగు సార్లు పదునైన ఆయుధంతో దాడి చేశాడు. మొదట సూపర్ వైజరే దాడి చేశాడని.. కాపాడుకోడానికే తాను అతడిపై తిరిగి దాడి చేశానని కోర్టులో ఆ యువకుడు చెప్పాడు.. అయినప్పటికీ అతడి మాటలను కోర్టు నమ్మలేదు.

తాను అల్ కోజ్(Al Quoz) ప్రాంతంలో ఉండేవాన్నని.. ఓ రోజు తమ సూపర్ వైజర్ నన్ను పిలిచి తన కోరికలను బయటపెట్టాడని.. వాటికి తాను ఒప్పుకోకపోవడంతోనే నన్ను బెదిరించాడని చెప్పాడు. ఆ తర్వాత కూడా వేధిస్తూ ఉండడంతో సూపర్ మార్కెట్ కు వెళ్ళి కత్తి తీసుకొని వచ్చానని.. అతడు పార్కింగ్ ప్రాంతంలో ఉండగా తాను పొడిచేశానని చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here