పెద్ద బిల్డింగ్ పైన నుండి దూకాడు.. ప్యారాచూట్ ఓపెన్ అవ్వలేదు.. ఆ తర్వాత..!

కొందరు వ్యక్తులు చేసే సాహసాలు చూడటానికే ఒళ్ళు గగుర్పొడుతుంది. ఎందుకంటే ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కూడా ఆ వ్యక్తుల ప్రాణాలకే ప్రమాదం. అలాంటి పొరపాటే ఓ పారాగ్లైడర్ కు ఎదురైంది. అదేమిటంటే పెద్ద బిల్డింగ్ పైన నుండి ప్యారాచూట్ తో దూకగా అది ఓపెన్ అవ్వలేదు. దీంతో అతడు అమాంతం కిందకు పడిపోయాడు.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అతడి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం కూడా లేదు.. అతడి అదృష్టం అలాంటిది..! ఈ ఘటన స్వీడన్ రాజధాని అయిన స్టాక్ హోమ్ లో చోటుచేసుకుంది. 246 అడుగుల ఎత్తు ఉన్న బిల్డింగ్ నుండి బేస్ జంపర్ దూకాడు.. అయితే ఏమైందో ఏమో కానీ అతడి ప్యారాచూట్ తెరచుకోలేదు. దీంతో అతడు అమాంతం కింద పడిపోయాడు. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానిక మీడియా రిపోర్టుల ప్రకారం అతడి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగలేదట.

https://www.liveleak.com/view?i=8c9_1519220039

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here