బ‌స్సు కింద న‌లిగిన మృత‌దేహం ప‌క్క‌న కూర్చుని సెల్ఫీ దిగాడు!

బ‌స్సు కింద ప‌డి న‌లిగిన మృత‌దేహం ప‌క్క‌నే కూర్చుని చిరున‌వ్వులు చిందిస్తూ సెల్ఫీ దిగాడో యువ‌కుడు. సెల్ఫీ పిచ్చి ఏ స్థాయిలో ముదిరి పాకాన ప‌డిందో చెప్ప‌డానికి ఇదొక్క ఉదాహ‌ర‌ణ చాలు. ఇంత‌కంటే ఉదాహ‌ర‌ణ‌లు దొర‌క‌వు కూడా.

ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని క‌రౌలీలో స‌మీపంలో చోటు చేసుకుంది. ఆదివారం మ‌ధ్యాహ్నం ధౌల్‌పూర్ నుంచి బ‌య‌లుదేరిన ఓ ప్రైవేటు బస్సు క‌రౌలీ స‌మీపంలోని ఘాట్ వ‌ద్ద అదుపు త‌ప్పింది.

ఘాట్ సెక్ష‌న్‌లో వేగంగా మ‌లుపు తిరుగ‌బోయి, ప‌ల్టీ కొట్టింది. ఆ స‌మ‌యంలో బైక్‌పై వెళ్తోన్న ముగ్గురిపై ప‌డింది ఈ బ‌స్సు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురూ సంఘ‌ట‌నాస్థ‌లంలోనే దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.

బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న 20 మంది గాయ‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదాన్ని చూసిన స్థానికులు పెద్ద సంఖ్య‌లో సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. కొంద‌రు బాధితుల‌కు స‌హాయం అందిస్తుండగా.. న‌లుగురైదుగురు యువ‌కులు.. ఇలా మృత‌దేహాల‌తో సెల్ఫీ దిగుతూ క‌నిపించారు.

 

జ‌నంలో ముదిరిపోయిన సెల్ఫీ పిచ్చికి ప‌రాకాష్ట‌గా దీన్ని చెప్పుకోవ‌చ్చు. మృతుల‌ను హాల్కే, విక్ర‌మ్‌, ష‌రీఫ్‌గా గుర్తించారు. ఈ ప్ర‌మాదంలో క‌రౌలీ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here