అర్ధ‌రాత్రి దాకా సెల్‌ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్న భ‌ర్త‌..విసుగెత్తి హాట్‌స్పాట్‌ను ఆఫ్ చేసిందంతే!

హైద‌రాబాద్‌: త‌న భ‌ర్త సెల్ ఫోన్‌లో పోర్న్ వీడియోల‌ను చూస్తున్నాడ‌ని విసుగు చెందిన ఓ మ‌హిళ ఇంట్లో అమ‌ర్చిన వైఫై హాట్‌స్పాట్‌ను ఆఫ్ చేసింది. అదే ఆమె చేసిన పాపం. ఆమె చేసిన ఈ చ‌ర్య ఆ భ‌ర్త‌ను ఆగ్ర‌హానికి గురి చేసింది. భార్యను తీవ్రంగా కొట్టాడు. ముఖం ప‌గిలేలా పంచ్‌లు ఇచ్చాడు. అత‌ని రాక్ష‌స దెబ్బ‌ల‌కు ఆమె తీవ్రంగా గాయ‌పాలైంది. ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ లో చోటు చేసుకుంది.

హైద‌రాబాద్ ఖైర‌తాబాద్ స‌మీపంలోని బీఎస్ మ‌ఖ్తాకు చెందిన ఆ భ‌ర్త పేరు మ‌హ‌మ్మద్ ఉమ‌ర్‌. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి. ఏడేళ్ల కింద‌ట అత‌నికి రేష్మ అనే యువ‌తితో పెళ్ల‌యింది. రాజ్‌భ‌వ‌న్ స‌మీపంలోని బీఎస్ మ‌ఖ్తాలో నివాసం ఉంటున్నారు.

వారికి ముగ్గురు పిల్ల‌లు. వ్యాపార కార్య‌క‌లాపాల కోసం ఉమ‌ర్ ఇంట్లో వైఫై హాట్‌స్పాట్‌ను అమ‌ర్చుకున్నాడు. అత‌నికి సెల్‌ఫోన్‌లో పోర్న్ వీడియోల‌ను చూడ్డానికి బానిస అయ్యాడు. బుధ‌వారం అర్ధ‌రాత్రి అయిన‌ప్ప‌టికీ.. నిద్ర‌పోకుండా వాటినే చూస్తూ కూర్చున్నాడు. దీనితో ప‌లుమార్లు అత‌నికి నిద్ర‌పొమ్మ‌ని చెప్పింది రేష్మ‌.

అయిన‌ప్ప‌టికీ.. అత‌ను ప‌ట్టించుక‌క‌పోవ‌డంతో నేరుగా వెళ్లి వైఫై స్విచ్‌ను ఆపేసింది. దీనితో తీవ్ర ఆగ్ర‌హానికి గురైన ఉమ‌ర్‌.. రేష్మ‌ను ఇష్టానుసారంగా కొట్టాడు. ఆమెను చిత‌గ్గొట్టాడు. ముఖంపై పంచ్‌లు ఇచ్చాడు. దీని దెబ్బ‌కు ఆమె తీవ్రంగా గాయ‌ప‌డింది. ఆమె కేక‌లు విన్న ఇరుగు పొరుగు వారు రేష్మ‌ను అత‌ని బారి నుంచి కాపాడారు.

ఉమ‌ర్ దెబ్బ‌ల‌కు సొమ్మ‌సిల్లిన రేష్మ‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆమె అక్క‌డ చికిత్స తీసుకుంటున్నారు. రేష్మ‌, ఆమె త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు ఖైర‌తాబాద్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here