అతి దగ్గరగా వచ్చాడు… ముఖం మీద ఇంకు పోసేశాడు.. హార్దిక్ పటేల్ కు అవమానం..!

పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కు కొన్ని రోజుల క్రితం ఉజ్జయినిలో అడుగుపెడితే తాము ఒపుకోమని గుజ్రార్ సంఘం హెచ్చరించింది. గుజ్రార్ మహాసభ కార్యకర్త అయిన మిలింద్ గుజ్రార్ అప్పట్లో మాట్లాడుతూ హార్దిక్ కానీ మధ్యప్రదేశ్ కు వస్తే అతడి ముఖాన్ని నల్లగా మార్చేస్తానని చెప్పాడు. అయితే ఈ మాటలు ఏదో మాటవరసకు అన్నాడేమో అని అనుకున్నారు.. తీరా అదే నిజమైంది.

మధ్యప్రదేశ్‌లో మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన హార్దిక్ ఉజ్జయినిలో రోడ్డు పక్కన ఉన్న ఓ హోటల్‌లో భోజనం చేస్తుండగా మిలింద్ అతడిపై ఇంకు చల్లాడు. గుజ్రార్ మహాసభ కార్యకర్తగా చెబుతున్న మిలింద్ గుజ్రార్ ఒక్కసారిగా లేచి పటేల్‌పై ఇంకు కుమ్మరించాడు. దీంతో పటేల్ చొక్కా మొత్తం ఇంకుతో తడిసిపోయింది. హార్దిక్ కు అతి దగ్గరగా వచ్చిన మిలింద్.. ఇంకు మొఖం మీద చల్లేశాడు. ఈ ఘటనతో హార్దిక్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.

వెంటనే అప్రమత్తమైన పటేల్ మద్దతుదారులు గుజ్రార్‌ను పట్టుకుని దాడిచేశారు. ఇష్టం వచ్చినట్టు కొట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని వారి నుంచి అతడిని రక్షించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here