షోయబ్ అఖ్తర్ చనిపోయాడంటూ పోస్టు పెట్టాడు.. అందుకు అఖ్తర్ ఏమని రిప్లై ఇచ్చాడు..!

పాకిస్థాన్ క్రికెట్ అంటే చాలు.. ఫాస్ట్ బౌలర్లే గుర్తుకు వస్తారు. షోయబ్ అఖ్తర్ కూడా అలాంటి ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజమే..! ఈ రావల్పిండి ఎక్స్ ప్రెస్ ఆ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. షోయబ్ కు ఒక్క పాకిస్థాన్ లోనే కాదు.. భారత్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. షోయబ్ అప్పుడప్పుడు అభిమానులతో సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు వాళ్ళు చేసే కామెంట్లకు స్పందిస్తూ ఉంటాడు కూడానూ..!

అయితే ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నవ్వులు కురిపిస్తోంది. అందులో షోయబ్ అఖ్తర్ చనిపోయాడంటూ అర్థం వచ్చేలా రాశాడు. ఆ విషయం వైరల్ అవుతూ ఉండగా అఖ్తర్ స్పందించి అతడు పెట్టిన పోస్ట్ నవ్వుల కోసమేనని తాను చావలేదని చెప్పాడు. మంచి జోక్ వేయడానికి ప్రయత్నించావు అని ట్వీట్ చేశాడు.

https://www.facebook.com/ahsan.kamal.94651/posts/2076281749273535

ఎహసాన్ కమాల్ పాషా అనే వ్యక్తి.. ‘శాడ్ న్యూస్.. షోయబ్ అఖ్తర్ వయసు 42 ఏళ్ల వయసు.. ఇప్పుడే పళ్ళషాప్ ముందు నుండి వెళ్ళిపోయాడు’ అని ఇంగ్లీష్ లో రాశాడు. అయితే ఆ ఇంగ్లీష్ లో రాసినప్పుడు ‘passed by’ అని రాయడం.. ముందుగా శాడ్ అని రాయడం.. వయసు 42 అని రాయడంతో షోయబ్ అఖ్తర్ కు ఏమైనా అయిందా అని అనుకున్నారు. ‘passed by’ అంటే అటునుండి వెళ్ళాడు అని అర్థం.. కాని కొందరు ‘passed away’ అంటే చనిపోయాడు అని అర్థం చేసుకున్నారు. దీనిపై అఖ్తర్ స్పందిస్తూ తాను ప్రతి రోజూ ఫ్రూట్ షాప్ ను దాటుకుని వెళుతూ ఉంటానని.. జోక్ మంచిగా ట్రై చేశావ్ అని ఆ వ్యక్తి పోస్ట్ ను షేర్ చేసి నవ్వులు పూయించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here