వంతులు వేసుకుని మ‌రీ కొట్టి చంపారు!

వంతుల‌వారీగా కొట్టి.. చంపేశారు!
చెత్త ఏరుకుంటూ త‌న భార్య‌తో క‌లిసి ఓ ఫ్యాక్ట‌రీ ఆవ‌ర‌ణ‌లోకి ప్ర‌వేశించ‌డ‌మే అత‌ను చేసిన నేరం. ఆవ‌ర‌ణ‌లోకి ప్ర‌వేశించిన వెంట‌నే ఆ దంప‌తులిద్ద‌ర్నీ మెడ ప‌ట్టి గోడౌన్‌లోకి తోసి అమాన‌వీయ చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు ఆ ఫ్యాక్ట‌రీ య‌జ‌మాని, సిబ్బంది. ఇద్ద‌ర్నీ చితగ్గొట్టారు. ఆ మ‌హిళ‌ను పంపించి వేసి, ఆమె భ‌ర్త‌ను గోడౌన్ త‌లుపుల‌కు క‌ట్టేసి, ఇష్టానుసారంగా కొట్టారు.

ఆ దెబ్బ‌ల‌కు తాళ‌లేక ఆ వ్య‌క్తి మ‌ర‌ణించాడు. ఈ అమానుష ఘట‌న గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో.. ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాణి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. మృతుడి పేరు ముఖేష్ వ‌ణియా. అత‌నిది ద‌ళిత కుటుంబం. సురేంద్ర న‌గ‌ర్ జిల్లాకు చెందిన ముఖేష్.. కొద్దిరోజుల కింద‌టే త‌న భార్య‌తో క‌లిసి రాజ్‌కోట్‌కు వ‌చ్చాడు.

అత‌నికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చెత్త‌ను ఏరుకుని, దాన్ని అమ్ముకుని జీవించే వృత్తి అత‌నిది. చెత్త‌ను ఏరుకుంటూ రాజ్‌కోట్ పారిశ్రామిక‌వాడలోని ఓ ఫ్యాక్ట‌రీ ఆవ‌ర‌ణ‌లో అడుగు పెట్టాడు. దీన్ని గ‌మ‌నించిన ఆ ఫ్యాక్ట‌రీ య‌జ‌మాని ఇద్ద‌ర్నీ గోడౌన్‌లో క‌ట్టేసి, కొట్టాడు. సిబ్బంది అత‌నికి స‌హ‌క‌రించారు. వంతులు వేసుకుని మ‌రీ కొట్టారు.

తీవ్ర గాయాల‌పాలైన మ‌హిళ‌ను బ‌య‌టికి పంపించేశారు. ముఖేష్‌ను మాత్రం వ‌ద‌ల్లేదు. కులం ఏమిటని అడుగుతూ మ‌రీ కొట్టారు. ఈ సంభాష‌ణ ఈ వీడియోలో రికార్డ‌య్యింది. న‌డ‌వ‌లేని స్థితికి చేరుకున్న అత‌ణ్ని రెక్క‌లు విరిచి, బ‌య‌టికి తోసి వేశారు.

అప్ప‌టికే ఫ్యాక్ట‌రీ వ‌ద్ద‌కు చేరుకున్న ముఖేష్ భార్య, అత‌ని పిల్ల‌లు, ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆక్కడ చికిత్స పొందుతూ ముఖేష్ మ‌ర‌ణించాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టిదాకా పోలీసులు ఎవ్వ‌ర్నీ అరెస్టు చేయ‌లేదట‌. కేసు న‌మోదైన విష‌యం తెలుసుకుని ఫ్యాక్ట‌రీ య‌జ‌మాని, అత‌ని సిబ్బంది ఎస్కేప్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here