ప్రపంచంలోనే అతి కారం ఉన్న మిరపకాయను తిన్నాడు.. ఆ తర్వాత ఏమైందంటే..!

ప్రపంచంలో అతి కారం ఉన్న మిరపకాయలలో ‘కరోలినా రీపర్’ ఒకటి.. దీన్ని తినడం చాలా దాహిర్యంతో కూడుకున్న పని..! అందుకే దాన్ని తాకడానికి కూడా భయపడుతూ ఉంటారు. అలాంటిది ఓ వ్యక్తి దాన్ని తిన్నాడు.. అంతే వెంటనే ఆసుపత్రికి పరిగెత్తుకు వెళ్ళాడు.

ప్రస్తుతం అతడికి తీవ్రమైన తలనొప్పి ఉందట.. ఈ మిరపకాయను తినే పోటీలో 34 ఏళ్ల వ్యక్తి కూడా పాల్గొన్నాడు. దాన్ని తిన్న తర్వాత ఒక్క సారిగా అతడికి తలనొప్పి విపరీతంగా వచ్చేసింది. అంతేకాకుండా మెడ నొప్పి కూడా బాధించడంతో వెంటనే ఆసుపత్రికి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఇలా మిరపకాయ తిన్న వ్యక్తికి ఇలా జరగడం ఇదే మొదటిసారి అని వైద్యులు అంటున్నారు.

న్యూయార్క్ లో ఉన్న డాక్టర్ కిలోతుంగన్ గుణశేఖరన్ దీనిపై స్పందించాడు. థండర్ క్లాప్ తలనొప్పి అన్నది ఆ వ్యక్తిని విపరీతంగా బాధిస్తోందని.. అతడు ఎమర్జెన్సీ రూమ్ లో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. హాట్ పెప్పర్ కాంటెస్ట్ లో అతడు పాల్గొన్నాడని.. అక్కడ ఈ మిరపకాయను తిన్న తర్వాతనే ఈ లక్షణాలు మొదలయ్యాయని చెప్పుకొచ్చాడు. కొద్ది రోజులు బాగానే ఉన్నా.. ఆ తర్వాత అతడికి తీవ్రమైన తలనొప్పి వచ్చిందని. అందుకే ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. అతడి పరిస్థితి నార్మల్ కు రావడానికి కొన్ని వారాలు పట్టిందట.. ఈ ఉదంతంపై BMJ కేస్ రిపోర్ట్స్ జర్నల్ లో ప్రచురించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here