తెలుగు సినిమా పరిశ్రమలో ల## ము@@#లు ఉన్నారు అని యాంకర్ అంటే..!

ఇటీవల పోసాని కృష్ణమురళి ప్రముఖ ఛానెల్ తో జరిగిన డిబేట్ లో నోటికి వచ్చినట్లు మాట్లాడారు. దీనిపై ఇప్పటికే తెలుగు సినిమా ప్రముఖులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలీసులకు కూడా కంప్లయింట్ ఇచ్చారు. దీనిపై మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘విషయం ఏదైనప్పటికీ మహిళలను ఇలా లేబులింగ్ చేస్తూ ఏ ఒక్కరు కూడా అలాంటి మాటలు మాట్లాడరాదు. నటీమణులను ఉద్దేశిస్తూ అలా మాట్లాడటాన్ని ఏ ఒక్కరూ సహించరు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దీన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదు. పబ్లిసిటీ కోసం సినీ పరిశ్రమలోని మహిళలను ఉద్దేశించి అమర్యాదకరంగా మాట్లాడటం కన్నా నీచమైనది మరొకటి ఉండదు’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

ఓ చానెల్ ఎడిట‌ర్ తెలుగు సినిమా వాళ్ల గురించి నోరు జార‌ర‌నే దాని దగ్గ‌ర అస‌లు వివాదం ప్రారంభ‌మైంది. తెలుగు సినిమా వాళ్ల గురించి హ‌ద్దులు మీరి మాట్లాడుతున్నార‌ని, సినీ న‌టీమ‌ణుల గురించి ఎలా పడితే అలా రాయడానికి వీలు లేని మాటలు అన్నారు. క‌నీస అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నార‌ని ఆ ఎడిట‌ర్‌పై ప‌లువురు సినీ ప్రముఖులు అన్నారు. అప్పటికే పోసాని ఆ డిబేట్ లో ఓ పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన ఈ యాంకర్ గారిని లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోలు బాగా చర్చిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here