మంచు లక్ష్మి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిందిగా.. మోహన్ బాబు ఇక్కడ లేరు.. ఉండి ఉంటే మీ పని..!

మంచు లక్ష్మి.. ఓ వైపు యాక్టింగ్.. మరో వైపు మంచి మంచి పనులు చేస్తూ బిజీబిజీగా ఉంటారు. ఇక మహిళలపై జరుగుతున్న అన్యాయాల గురించి ఎప్పుడూ తన గొంతు వినిపిస్తూ ఉంటారు. తమ బతుకు తాము బతుకుంటే వెబ్ సైట్స్, మీడియా తమ ఇష్టానుసారం తమపై రాతలు రాస్తున్నాయంటూ ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి మండిపడ్డారు. ఓ ఛానల్ లో ఇటీవల జరిగిన చర్చలో జర్నలిస్టు మాట్లాడిన పదాలపై ఆమె తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. తన తండ్రి మోహన్ బాబు ప్రస్తుతం ఇక్కడ లేరని, ఆయన ఉండి ఉంటే కనుక ఇలాంటి పిచ్చిరాతలు రాస్తున్న వారిని ఓ రేంజ్ లో కడిగి పారేసేవారని, ప్రశ్నించే వారు లేరు కదా అని చెప్పి ఇష్టానుసారం పిచ్చి రాతలు రాస్తే కుదరదని మంచు లక్ష్మి హెచ్చరించారు.

ఓ జర్నలిస్టు అసభ్యంగా ప్రశ్నిస్తుంటే ప్రెస్ క్లబ్ ఏం చేస్తోంది? మేము ఊరుకునే కొద్దీ మీరు రెచ్చిపోతారా? మేము డబ్బులిస్తేనే కదా, మా సినిమా గురించి మీరు రాసేది? ఊరికినే ఏమీ రాయట్లేదుగా? అంటూ వెబ్ సైట్స్, మీడియాపై ఆమె మండిపడ్డారు. ఆర్టిస్ట్ లపై ఇష్టానుసారం రాస్తూ, తమను క్షోభకు గురిచేస్తున్నారని, ఇలా చేయడం తగదని అన్నారు. తనకు గుర్తు ఉండి ఇలా జరగడం ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. తాను పుట్టినప్పటి నుండి సినిమా ఇండస్ట్రీలో ఉన్నానని కానీ ఇలా రాయడం చాలా తప్పు అని చెప్పారు. తమ మొఖాలు పెట్టుకొనే బ్రతుకుతున్నారని.. కావాలనుకుంటే లక్షల మంది బ్రతకచ్చని.. కానీ ఇలా రాయడం తప్పని అన్నారు మంచు లక్ష్మి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here