ముఖ్యమంత్రికి చుక్కలు చూపిస్తున్న బీరు తాగే అమ్మాయిలు..!

బీరును తాగుతున్న అమ్మాయిలను చూస్తుంటే తనకెంతో భయం కలుగుతోందని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఆయన వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలకు ‘గర్ల్స్ హూ డ్రింక్ బీర్’ (#GirlsWhoDrinkBeer) హ్యాష్ ట్యాగ్ జోడిస్తూ బీర్ తాగుతూ ఉన్న ఫోటోలను పెట్టారు.

https://twitter.com/Ssaniya25/status/962263908621922304

గోవా నుండి డ్రగ్స్ పారద్రోలాలని ఆయన మాట్లాడుతూ అనవసరంగా మహిళలు బీర్ తాగడం పై కామెంట్లు చేశారు. ఇక మహిళలు ఊరికే ఉంటారా చెప్పండి. సోషల్ మీడియా వేదికగా మనోహర్ పారికర్ ను ఆటాడుకుంటున్నారు. మహిళల గురించి మీకు తెలియాల్సింది చాలానే ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. బీర్ తాగుతూ ఫోటోలు పెడుతున్న వాళ్ళలో టీనేజ్ యువతుల దగ్గర నుండి.. ముసలి వాళ్ళు కూడా ఉన్నారు.

https://twitter.com/saniya_rao/status/962330097175879680

గోవా పట్టణ, ప్రణాళిక మంత్రి విజయ్ సర్దేశాయ్ అయితే మరీ ఎక్కువ మాట్లాడేశారు. సేద తీరేందుకు గోవా వెళ్లే పర్యాటకులను అలగా జనంగా అభివర్ణించారు. ఉత్తరాది పర్యాటకులు మురికి వదిలిపెట్టి వెళ్లిపోతున్నారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ‘గోవా బిజ్ ఫెస్ట్’లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గోవా వస్తున్న దేశీయ పర్యాటకుల్లో అత్యధిక శాతం మంది అలగా జనమేనని.. రాష్ట్ర జనాభా కంటే ఆరు రెట్లు ఎక్కువగా పర్యాటకులు వస్తున్నారని, వీరు ఉన్నత స్థాయికి చెందిన వారు కాదని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here