మ‌ద్యాన్ని మితిమీరి తాగితే..ఇలాంటి కొత్త‌ రోగాలే వ‌స్తాయి మ‌రి!

బీజింగ్‌: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న వ్య‌క్తి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి. పేరు టాన్‌. వ‌య‌స్సు 68 సంవ‌త్స‌రాలు. చైనాలోని గ్జియాంగ్యాంగ్ సిటీలో నివాసం ఉంటున్నారు. 13 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు నుంచే మందు కొట్ట‌డం అల‌వాటు చేసుకున్నాడ‌ట‌. ఉద్యోగంలో చేరిన త‌రువాత ఆ తాగుడు మ‌రింత ఎక్కువైంది. రోజూ ఓ బాటిల్ కావాల్సిందేన‌ట‌.

రైస్ వైన్‌ను ఎక్కువ‌గా తాగేవాడ‌ట‌. రైస్ వైన్‌కు మంచి డిమాండ్ ఉంద‌ట చైనాలో. దాన్ని తాగి, తాగి.. ఎలా త‌యార‌య్యాడంటే `హ‌ల్క్‌` సినిమాలో బిగ్ గ్రీన్ సూప‌ర్‌హీరో క్యారెక్ట‌ర్‌లాగా మారిపోయాడు. మెడ‌, చేతులు, కాళ్లూ..ఇలా ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ కండ బాగా పెరిగింది. మెడ‌తో పాటు చాలా చోట్ల కొవ్వు..ట్యూమ‌ర్‌లా పేరుకుపోయింది.

కొద్దిరోజుల కింద‌టే టాన్ హ్యునాన్ ప్రావిన్స్‌లోని పీపుల్స్ ఆసుప‌త్రిలో చేరాడు. అత‌ను సిమ్మెట్రిక్ లైపోమాటోసిస్ వ్యాధి బారిన ప‌డ్డాడ‌ని డాక్ట‌ర్ ఛంగ్షా చెప్పారు. మ‌ద్యాన్ని మితిమీరి తాగితే ఇలాంటి రోగాలే వ‌స్తాయ‌ని చెప్పారు. అత‌నికి లైపోస‌క్ష‌న్ ఆప‌రేష‌న్ చేయాల్సి ఉంటుంద‌ని పీపుల్స్ ఆసుప‌త్రి డాక్ట‌ర్లు చెబుతున్నారు.

ఈ త‌ర‌హా రోగులు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 400 మంది ఉన్నార‌ని, వారిలో స‌గం మంది చైనాలోనే ఉన్నార‌ని అంటున్నారు. 2011లో అత‌ని మెడ కొద్దికొద్దిగా వాయ‌డం మొద‌లు పెట్టింది. ఆ త‌రువాత ఈ స్థితికి చేరుకుంది. అప్ప‌ట్లోనే డాక్ట‌ర్ల‌కు చూపిస్తే..అప్ప‌టిక‌ప్పుడు ఆప‌రేష‌న్ చేయ‌లేమ‌ని చేతులెత్తేశారు. తాజాగా- ఇప్పుడు టాన్‌కు ఆప‌రేష‌న్ చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here