టాయ్‌లెట్‌కు వెళ్లి సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ కూర్చున్నాడు! అది జారి, బ‌య‌టికొచ్చేసింది!

సెల్‌ఫోన్లు చేతికొచ్చిన త‌రువాత క‌ర్ణుడి క‌వ‌చ‌కుండ‌లాల్లాగా అతుక్కుపోయాయి. బాత్‌రూమ్‌కు వెళ్లినా, టాయ్‌లెట్‌కు వెళ్లినా అది వెంట ఉండాల్సిందే. ఫోన్‌కాల్స్ వ‌స్తాయ‌ని కాదు గానీ.. గేమ్స్ ఆడుకోవ‌డానికి.

టాయ్‌లెట్‌కు వెళ్లి సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడే అల‌వాటు చాలామందికి ఉంది. ఆ గేమ్‌ల గోల‌లో ప‌డి, మ‌నం ఎక్క‌డ ఉన్నామ‌నే విష‌యాన్ని కూడా మ‌ర్చిపోయే మ‌హానుభావులు ఉన్నారు. ఈ క‌థ కూడా అలాంటి మ‌హానుభావుడిదే.

సెల్‌ఫోన్ చేత్తో ప‌ట్టుకుని టాయ్‌లెట్‌కు వెళ్లాడో వ్య‌క్తి. వెస్ట్ర‌న్ స్టైల్ టాయ్‌లెట్ బేసిన్‌పై కూర్చున్నాడు. స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడ‌టంలో మునిగిపోయాడు. సుమారు 40 నిమిషాల పాటు అత‌ను టాయ్‌లెట్‌లోనే గ‌డిపాడు.

దీనితో.. పెద్ద పేగు చివ‌రన ఉండే `రెక్ట‌మ్‌` జారి బ‌య‌టికి వ‌చ్చింది. చిన్న‌సైజు బంతిలాగా అర అడుగు కిందికి వ‌చ్చేసింది. దీనితో ఉలిక్కిప‌డ్డ ఆ వ్య‌క్తి.. అంబులెన్స్ అంటూ కేక‌లు పెట్టాడు. న‌డ‌వ‌లేని స్థితిలో ఆసుప‌త్రికి వెళ్లాడు.

డాక్ట‌ర్లు ఆప‌రేష‌న్ చేసి, రెక్ట‌మ్‌ను తొల‌గించారు. ఈ ఘ‌ట‌న చైనాలోని ఝోంగ్డా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వ్య‌క్తి పేరు తెలియ‌రావ‌ట్లేదు గానీ.. చైనాలోని స‌న్ యాట్సెన్ యూనివ‌ర్శిటీ ఆసుప‌త్రిలో అత‌నికి శ‌స్త్ర చికిత్స చేశారు డాక్ట‌ర్లు. డాక్ట‌ర్ సు డాన్ అనే లేడీ డాక్ట‌ర్ సుమారు గంట‌పాటు ఆప‌రేష‌న్ చేసి, రెక్ట‌మ్‌ను తొల‌గించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here