ఒక్క కట్ కూడా లేకుండా విడుదల కాబోతున్న ‘న్యూడ్’ సినిమా..!

మన దేశంలో సినిమాలు తీసేటప్పుడు ఎంతగానో ఆలోచించి తీయాలి.. ఏది పడితే ఆ సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకొని సినిమా తీశామంటే చాలా ఇబ్బందులే ఎదురవుతాయి. ముఖ్యంగా సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాను ఎక్కడ కత్తిరించి పడేస్తారేమో అన్న భయం ఉండనే ఉంటుంది. అయితే వీటన్నిటినీ దాటుకొని విడుదలవ్వడానికి రెడీ అవుతోంది ‘న్యూడ్’ అనే మరాఠీ చిత్రం.

పేరులోనే ‘న్యూడ్’ అని ఉంది కదా.. మన సెన్సార్ బోర్డు ఎలాంటి కత్తిరింపులు చేసుంటుందో అని అందరూ అనుకుంటారు. అయితే ఒక్క కట్టింపు కూడా ఈ చిత్రానికి పడలేదు. కళ్యాణీ మూలే, ఛాయా కదం, నసీరుద్దీన్ షా ఇందులో నటించారు. ఓ తల్లి తన కొడుకుకు మంచి చదువు చెప్పించాలనే నగ్నంగా ఆర్ట్ కాలేజీ విద్యార్థుల ముందు కూర్చుంటూ ఉంటుంది. అదే ఈ చిత్ర కథ.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.

ఇలాంటి సబ్జెక్ట్ ను సి.బి.ఎఫ్.సి. అంత సింపుల్ గా సర్టిఫికెట్ ఇవ్వదని మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే ఆశ్చర్యంగా ఒక్క కట్ కూడా లేకుండా ‘A’ రేటింగ్ ఇచ్చేసింది. కొన్ని సినిమాలకు ‘A’ రేటింగ్ ఇచ్చినా కూడా కట్స్ చెబుతూ ఉంటారు. కానీ అలాంటిది ఏదీ ఈ సినిమాకు లేదు.. రవి జాదవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేయబోతున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here