పెళ్ళి ఊరేగింపు.. కత్తితో ఫీట్లు ప్రాణాలు తీసెనే..!

పెళ్ళి ఊరేగింపులు కొందరు ఏదో సంప్రదాయబద్దంగా చేస్తే.. మరికొందరు మాత్రం ఏదో ఉత్సవంగా నిర్వహించాలని చూస్తారు. అలాంటి పెళ్ళిళ్ళలో ఎన్నో అపశ్రుతులు చోటుచేసుకుంటూ ఉంటాయి. తాజాగా హైదరబాద్ లో ఓ పెళ్ళి ఊరేగింపులో మార్ఫా విన్యాసం ఓ కుర్రాడి ప్రాణాలు తీసింది.

హైదరాబాద్‌లోని షేక్‌పేటలో 3 రోజుల కిందట చోటు చేసుకున్న ఈ విషాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షేక్‌పేటకు చెందిన సయ్యద్‌ హమీద్‌ స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. స్నేహితుల ఆహ్వానం మేరకు మూడు రోజుల కిందట అతడు ఓ పెళ్లి బారాత్‌కు వెళ్లి డాన్స్ చేశాడు. అయితే ఎక్కడి నుండి వచ్చిందో ఏమో కానీ ఆ పిల్లాడికి ఓ కత్తి వచ్చి గుచ్చుకుంది. మెడవద్ద గుచ్చుకోవడంతో అతడికి రక్తం తీవ్రంగా వెళ్ళింది. దీనికి కారణం మార్ఫా విన్యాసం.

అనుభవం లేని కుర్రాళ్ళు మార్ఫా డ్యాన్స్ చేయడం వలన ఆ కత్తి హమీద్ కు గుచ్చుకుంది. చికిత్స పొందుతూ ఆదివారం హమీద్ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here