పెద్ద తప్పు జరిగిపోయిందని ఒప్పుకున్న మార్క్ జూకర్ బర్గ్..!

గత కొద్ది రోజులుగా ఫేస్ బుక్ లో డేటా లీక్ అయిందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా భారీగా ఫేస్ బుక్ షేర్లు పడిపోయాయి. ఫేస్ బుక్ ను అసలు నమ్మకూడదని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల పాటూ మౌనంగా ఉన్న ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్.. ఇప్పుడు స్పందించాడు. తన ఫేస్ బుక్ అకౌంట్ లో తప్పు జరిగిపోయిందని.. క్షమించమని ఫేస్ బుక్ వినియోగదారులను కోరాడు.

కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణంపై వివరణ ఇస్తూ పెద్ద తప్పు జరిగిపోయిందని, దాన్ని ఒప్పుకుంటున్నానని అన్నారు. రెండు సంస్థల మధ్య జరిగిన విశ్వాసాల ఉల్లంఘన ఇదని, ఇటువంటి ఘటనలు, తప్పులు మరోసారి జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో సుదీర్ఘమైన వివరణ ఇచ్చిన ఆయన, ఈ విషయంలో ఫేస్‌ బుక్ తీసుకోబోతున్న న్యాయపరమైన చర్యలపైనా వివరణ ఇచ్చారు. ఎటువంటి డాటా చౌర్యం భవిష్యత్తులో జరగకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నామని అన్నారు.

ఫేస్‌ బుక్ వ్యక్తిగత సమాచారాన్ని కొన్ని యాప్ లు దుర్వినియోగం చేస్తున్నాయని అన్నారు. ఆయన ఎంతగా వివరించినా కూడా పలు దేశాల అధికారులు ఫేస్ బుక్ కు సమన్లు జారీ చేస్తున్నారు. ఎంతో నమ్మామని కానీ ఇలా మోసం జరుగుతుంది అని అనుకోలేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై మార్క్ జూకర్ బర్గ్ త్వరలో సీఎన్ఎన్ లో ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.

I want to share an update on the Cambridge Analytica situation — including the steps we've already taken and our next…

Mark Zuckerbergさんの投稿 2018年3月21日(水)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here