5 ఎకరాల పొలం, ఒక స్కూటర్ ఉంది.. నన్ను పెళ్ళి చేసుకుంటావా అని రాయ్ లక్ష్మిని అడిగితే..!

రాయ్ లక్ష్మి లేదా లక్ష్మి రాయ్.. తెలుగు సినీ అభిమానులకు బాగా పరిచయమైన పేరు. దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న మన రత్తాలు ఇటీవలే బాలీవుడ్ లో జూలీ-2 సినిమా కూడా చేసింది. ఆమెకు అనుకున్నంత గుర్తింపును ఈ సినిమా మాత్రం ఇవ్వలేదు. ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.

https://twitter.com/aSouthIndian/status/977511308521242624

ఇలాంటి తరుణంలో ఆమెకు సోషల్ మీడియాలో ఓ పెళ్ళి ప్రపోజల్ వచ్చింది. అదేమిటంటే త‌న‌కి ఐదు ఎక‌రాల పొలం, స్కూట‌ర్‌ ఉంద‌ని ట్వీట్ ద్వారా తెలియ‌జేసిన ఓ వ్య‌క్తి రాయ్ ల‌క్ష్మీ ..నువ్వంటే చాలా ఇష్ట‌మ‌ని, నిన్ను పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటున్నాన‌ని చెప్పాడు. దీనికి స్పందించిన రాయ్ ల‌క్ష్మీ మీ ప్ర‌పోజ‌ల్‌కి ధ‌న్య‌వాదాలు.. ప్ర‌స్తుతం నాకు మ్యారేజ్ చేసుకునే ఆలోచ‌న లేదు. మీ జీవితంలోకి మంచి అమ్మాయి రావాల‌ని కోరుకుంటున్నాను అని రిప్లై ఇచ్చింది. సాధారణంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ప్రేమ లేఖలు చాలా ఎక్కువైపోయాయి. కొందరు తమ అభిమానాన్ని చూపుతూ ఉంటారు ఇలా..! కొందరి అభిమానానికి మెచ్చి సెలెబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉంటారు.

https://twitter.com/iamlakshmirai/status/977512077463040001

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here