చెల్లిని చూడడానికి పెళ్ళి చూపులకు వచ్చి.. పెళ్ళయి.. పిల్లలున్న అక్కను తీసుకుపోయిన పెళ్ళికొడుకు..!

అక్కని చూడడానికి పెళ్ళి చూపులకు వచ్చి.. చెల్లి నచ్చి పెళ్ళి చేసుకున్న ఘటనలు చాలా జరిగే ఉంటాయి..! అయితే ఇక్కడ సీన్ రివర్స్.. చెల్లిని చూడడానికి వచ్చి అక్కను పటాయించాడు. అది కూడా ఆమెకు పెళ్ళి అయి.. పిల్లాడు కూడా ఉన్నారు. ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు. చెన్నై లోని మైలాపూర్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఏకాంబరం పిళ్లైకి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయికి (26) పెళ్లి అయి, మూడేళ్ల కొడుకున్నాడు. చిన్నమ్మాయి (22)కి వివాహం చేయాలన్న ఉద్దేశంతో సంబంధాలు వెతుకుతున్నాడు. గత జనవరిలో అన్నాదురై (28) అనే యువకుడి నుండి సంబంధం వచ్చింది. పెళ్లి చూపులకు వచ్చిన అతను, ఆ సమయంలో పెద్దమ్మాయితో మాట కలిపాడు. పెళ్లి విషయమై ఎలాంటి నిర్ణయాన్ని చెప్పలేదట.. అయినప్పటికీ పెద్దమ్మాయితో మాట్లాడుతూ ఆమెకు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం పెద్ద కుమార్తె కాస్తా కనిపించకుండా పోయింది. పెద్ద కూతురు వెళ్లిపోయిందని తెలుసుకున్న తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఆమె 5 సవర్ల బంగారు నగలు, రూ. 2 లక్షల నగదు తీసుకెళ్లిందని కూడా ఆయన ఫిర్యాదు చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here