ఇంత సెక్యూరిటీ దేనికో తెలుసా..?

మీరు ఇక్కడ చూస్తున్న ఫోటోలు మచ్చుకు కొన్నే..! ఇంతకూ వీరంతా ఇలా రెడీగా ఉన్నది ఎందుకో తెలుసా..? కర్ణాటక అసెంబ్లీ ముందు. ఈరోజు కర్ణాటక అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకనే విధాన సౌద వద్ద మార్షల్స్ ను మొహరించారు. అంతకాకుండా సెక్యూరిటీని కూడా చాలా ఎక్కువగా పెంచేశారు.

ముఖ్యమంత్రిగా యడ్యూరప్పను ఎంత మంది సపోర్ట్ చేస్తారన్నది సాయంత్రానికళ్ళా తెలియబోతోంది. ఇప్పటికే పలు హైడ్రామా సన్నివేశాలు కర్ణాటకలో చోటుచేసుకుంటూ ఉన్నాయి. విధానసభలో కూడా ఎటువంటివి జరుగుతాయోనని అందరూ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. సాధారణంగా అసెంబ్లీ వద్ద 120 మంది మార్షల్స్ ఉండడమే ఎక్కువ.. అలాంటిది ఏకంగా 200 మంది మార్షల్స్ ఆ ప్రాంతంలో ఉన్నారు. ఇక సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగానే ఉంది.

కర్ణాటక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బోపయ్య సభ్యులతో ప్రమాణం చేయించారు. అంతకుముందు, ప్రొటెం స్పీకర్ బోపయ్య అసెంబ్లీలోకి ప్రవేశించిన అనంతరం, సీఎం యడ్యూరప్ప, మాజీ సీఎం సిద్ధరామయ్య సహా ఎమ్మెల్యేలందరూ లోపలికి ప్రవేశించారు. సరిగ్గా ఉదయం పదకొండు గంటలకు వందేమాతరం గేయంతో కర్ణాటక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here