స్విఫ్ట్‌, బాలెనో కార్ల‌ను వెన‌క్కి పిలిపిస్తోన్న మారుతి సుజుకి..ఎందుకు తెలుసా?

ముంబై: మారుతి సుజుకి గ‌ర్వంగా చెప్పుకోద‌గ్గ మోడ‌ల్ స్విఫ్ట్‌. దానికి కొన్ని మెరుగులు దిద్ది, బాలెనో పేరుతో కొత్త ర‌కం కారును మార్కెట్లోకి దించింది ఆ సంస్థ‌. చూడ్డానికి ముద్దొచ్చేలా ఉన్న బాలెనో కూడా పెద్ద ఎత్తున అమ్ముడుపోయాయి. దేశంలో అత్య‌ధికంగా అమ్ముడుపోయిన టాప్ టెన్ కార్ల‌లో ఈ రెండూ ఉంటాయి.

తాజాగా- స్విఫ్ట్‌, బాలెనో ర‌కం కార్ల‌ను వెన‌క్కి పిలిపిస్తోంది మారుతి సుజుకి సంస్థ‌. ఎందుకు? ఎందుకంటే- బ్రేక్ వాక్యుమ్ హోస్‌పైప్‌లో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. దీన్ని స‌రిచేయ‌డానికి ఆ ర‌కం కార్ల‌ను వెనక్కి పిలిపిస్తోంది. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 16వ తేదీ మధ్య‌లో విక్ర‌యించిన స్విఫ్ట్‌, బాలెనో ర‌కం కార్ల‌న్నింటినీ వెన‌క్కి పిలిపించాల‌ని మారుతి సుజుకి సంస్థ యాజ‌మాన్యం షోరూమ్ డీల‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేసింది.

గ‌త ఏడాది డిసెంబ‌ర్ 1-ఈ ఏడాది మార్చి 16వ తేదీ మ‌ధ్య ఈ రెండు మోడ‌ళ్ల‌కు చెందిన 52,686 కార్ల‌ను ఆ సంస్థ విక్ర‌యించింది. ఇప్పుడు వాటిని వెన‌క్కి పిలిపిస్తోంది. ఈ నెల 14వ తేదీ నుంచి కార్ల య‌జ‌మానుల‌కు దీనికి సంబంధించిన స‌మాచారాన్ని ఇస్తుంది. బ్రేక్ వాక్యుమ్ హోస్ పైప్‌ను స‌రిచేసిన త‌రువాత వాటిని వెన‌క్కి ఇచ్చేస్తుంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here