ఆడుకుంటున్న వాళ్ళు కొందరు.. అలా వచ్చిన జింకలు కొన్ని.. ఇంతలో పెద్ద మొసలి..!

కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా కొన్ని జీవులు మనుషులు ఉన్న ప్రాంతానికి వచ్చి అందరూ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ఓ పెద్ద మొసలి గోల్ఫ్ కోర్స్ నుండి అటుగా నడుచుకుంటూ వెళ్ళింది. చూసినోల్లంతా షాక్..! అక్కడే గోల్ఫ్ ఆడుతున్న వాళ్ళు అయితే ఇంత పెద్ద మోసలా అని మాట్లాడుకున్నారు.

ఈ మొసలి దాదాపు 12 అడుగుల పొడవు ఉంది. అంతే కాకుండా అక్కడే ఓ జింకల కుటుంబం కూడా ఉంది. ఆ మొసలి అక్కడి నుండి వెళ్ళిపోయే వరకూ ఆ జింకలు కూడా అలాగే సైలెంట్ గా ఉండిపోయాయి. ఈ ఘటన సౌత్ కరోలినా లోని ఓషియన్ క్రీక్ గోల్ఫ్ కోర్స్ లో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతోంది. Eat Sleep Play Beaufort అనే ఫేస్ బుక్ పేజిలో ఈ వీడియోను అప్లోడ్ చేశారు.

Monster gator walks across Lowcountry golf course

This video shared by the folks at Eat Sleep Play Beaufort captured an enormous gator walking across the Ocean Creek Golf Course at Fripp Island. -> https://bit.ly/2rwKnVA

WTOC-TVさんの投稿 2018年5月11日(金)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here