మరికొన్ని గంటల్లో మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు..!

మక్కామసీదులో 2007 మే 18వ తేదీన జరిగిన పేలుళ్ల కేసులో నాంపల్లిలోని NIA కోర్టు ఈరోజు ఉదయం తీర్పు చెప్పనున్నది. తెలంగాణ రాష్ట్రం లోనూ.. హైదరాబాద్ నగరం లోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఉగ్రవాదులకు మతం ఉండదని, విధ్యంసం చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కల్పించడమే వారి లక్ష్యమని చెప్తూ శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరుతున్నారు పోలీసులు.

2007 మే 18న మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో చార్మినార్‌ సమీపంలోని మక్కామసీదు ఆవరణలోగల వజూఖానా వద్ద ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌ తో బాంబు పేల్చారు. ఆ బాంబు పేలుడులో తొమ్మిది మంది మరణించగా 58 మంది గాయపడ్డారు. అప్పటి నుండి పలు కోణాల్లో విచారణ జరిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారు. జైలు వద్ద అదనపు బలగాలతో భద్రత ఏర్పాటుచేశారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరుపరిచే విషయంలోనూ జైలు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటుచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here