క‌న్ను ఒక‌టే దుర‌ద పెడుతోంద‌ని డాక్ట‌ర్ వ‌ద్ద‌కెళ్లింది..కంట్లోంచి ఇది బ‌య‌టికొచ్చింది!

నులి పురుగులు సాధార‌ణంగా పేగుల్లో క‌నిపిస్తుంటాయి. ఈ యువ‌తి విష‌యంలో మాత్రం కంట్లో కూడా క‌నిపించాయి. కొద్దిరోజులుగా కన్ను దుర‌ద పెడుతుండ‌టం, నీరు కారుతుండ‌టంతో డాక్ట‌ర్ వ‌ద్ద‌కెళ్లిందా అమ్మాయి. ప‌రీక్ష‌ల‌న్నీ చేసిన త‌రువాత ఓ నులి పురుగును బ‌య‌టికి తీసి చేతికి ఇచ్చాడు ఆ డాక్ట‌ర్‌. దాన్ని చూసి విస్తుపోవ‌డం ఆ యువ‌తి వంత‌యింది.

ఈ త‌ర‌హా ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం వైద్య రంగంలో ఇదే తొలిసారి అట‌. అమెరికా ఒరెగాన్ స్టేట్‌లోని గోల్డ్ బీచ్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ యువ‌తి పేరు అబీ బెక్లే.

కొద్దిరోజుల కింద‌ట అల‌స్కా ట్రిప్‌కు వెళ్లిన ఆ యువ‌తి అక్క‌డ కొనుగోలు చేసిన ఓ ఐ లైన‌ర్‌ను వాడింది. ఆ త‌రువాత నాలుగు వారాల త‌రువాత ఆమె కంట్లో ఈ నులిపురుగు ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ నులిపురుగు 1.27 సెంటీమీట‌ర్లు థెలాజియా గులోసా జాతికి చెందినదిగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై అమెరికాకు చెందిన‌ ట్రోపిక‌ల్ మెడిసిన్ అండ్ హైజీన్ మేగ‌జైన్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here