ఒకప్పుడు క్యాసెట్లు అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు.. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ అయ్యాడు..!

సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని సెలెబ్రిటీ చేస్తుందో అసలు ఊహించలేము.. ప్రస్తుతం మలయాళీ అమ్మాయి ప్రియ వారియర్ విషయంలో అదే జరిగింది. కానీ కొందరు మాత్రం సూపర్ స్టార్లు అయ్యారో.. వాళ్ళకు ఎందుకు స్టార్డమ్ వచ్చిందో అసలు ఊహించలేము. అలాంటి వాళ్ళలో బంగ్లాదేశ్ కు చెందిన అలోమ్ కూడా ఒకడు.

ఒకప్పుడు అలోమ్ క్యాసెట్లు అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. అయితే యుట్యూబ్ లో ఓ వీడియో పోస్ట్ చేసిన అతడు.. చివరికి అక్కడ స్టార్ అయ్యాడు. అతడికి సోషల్ మీడియాలో పలు ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయంటే మనకు నమ్మశక్యం కాదు. అతడు భారత్ లో అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ బంగ్లాదేశ్ లో అతడు ఓ సెన్సేషన్..!

జులై 2016, మీర్ పూర్ లోని షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో అలోమ్ ఉన్నాడు. అక్కడే మీడియా కూడా ఉంది. ప్రాక్టీస్ చేసి వచ్చిన బంగ్లాదేశ్ క్రికెటర్లు.. అతడితో ఫోటోలు తీసుకోడానికి ఎగబడ్డారు. అక్కడ అతడికి ఉన్న ఫాలోయింగ్ కు ఇది ఓ ఉదాహరణ. అలోమ్ తమ ఫేవరేట్ హీరో అని బంగ్లాదేశ్ ఆటగాడు టస్కిన్ అహ్మద్ కూడా చెప్పాడు.

అలోమ్ పూర్తీ పేరు అష్రఫుల్ ఆలమ్ సయీద్..! అతడు చాలా పేద కుటుంబంలో పుట్టాడు. అతడి తండ్రి మిశ్చర్ అమ్ముతూ జీవనం సాగించేవాడు. అలోమ్ పదేళ్ళ వయసు ఉన్నప్పుడు అతడి తండ్రి భార్యను, కొడుకును వదిలేసి వేరే మహిళను పెళ్ళి చేసుకున్నాడు. ఇక ఏదో ఒకటి చేసి సంపాదించాలని భావించిన అలోమ్ ఇటుకలు చేసే పనిలో పడ్డాడు.. చదువు కూడా ఎక్కకపోవడంతో ఏడో తరగతిలో ఫెయిల్ కూడా అయ్యాడు. ఇటుకల తయారీతో పాటూ క్యాసెట్లు అమ్మే పనికూడా చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here