ఈ న్యూస్ రీడ‌ర్ ఎవ‌రో చెప్ప‌గ‌ల‌రా?

ఇస్లామాబాద్‌: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న‌ది ఓ న్యూస్ రీడ‌ర్‌. పేరు మావియా మాలిక్‌. ఆమె ఓ హిజ్రా. ట్రాన్స్‌జెండ‌ర్‌. ఓ ఛాన‌ల్‌లో హిజ్రాను న్యూస్ రీడ‌ర్‌గా నియ‌మించ‌డం పాకిస్తాన్‌లో ఇదే తొలిసారి. కోహినూర్ న్యూస్ అనే పేరున్న ఛాన‌ల్‌లో ఆమె ప‌నిచేస్తున్నారు. మ‌న‌దేశంలో కూడా ఇప్ప‌టికే ఇద్ద‌రు హిజ్రాలు న్యూస్ రీడ‌ర్లుగా ప‌నిచేస్తున్నారు.

ప‌ద్మ‌ని ప్ర‌కాశ్ అనే ట్రాన్స్‌జెండ‌ర్‌.. లోట‌స్ న్యూస్ అనే ఛాన‌ల్‌లో ప‌నిచేస్తున్నారు. అప్స‌రా రెడ్డి అనే ట్రాన్స్‌జెండ‌ర్ బీబీసీలో ఉన్నారు. ట్రాన్స్‌జెండ‌ర్‌ను న్యూస్ రీడ‌ర్‌గా నియ‌మించ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌హిళ‌ల స‌మాన‌త్వం కోస‌మే కాకుండా, ట్రాన్స్‌జెండ‌ర్లకు కూడా స‌మాన‌త్వాన్ని క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు.

https://twitter.com/BeyondBinariesA/status/978005801309683712

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here