కుక్కలను, పిల్లులను పెంచుకుంటున్నట్లు ఏడు పులులను ఇంట్లో పెంచుకుంటున్నారు..!

సాధారణంగా ఇంట్లో ఎవరైనా కుక్కలనో, పిల్లులను పెంచుకుంటారు. అదే పులిని పెంచుకుంటే.. ఒకటీ.. రెండు.. కాదు ఏకంగా ఏడు పులులను పెంచుకోవడం అంటే మాటలా..! కానీ మార్కస్ బోర్జెస్ కుటుంబం అదే పనే చేస్తోంది. ఆ పులులు కూడా వారి పెంపుడు జంతువులు లాగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఏ రోజు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు హాని తలపెట్టలేదట.

బ్రెజిల్ లోని మరింగా లో మార్కస్ తన ఇంట్లో ఏడు పులులతో ఉంటున్నాడు. దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం మార్కస్ ఓ సర్కస్ నుండి రెండు పులులను కాపాడాడు. వాటిని తన ఇంట్లోనే పెంచుకోవడం మొదలుపెట్టాడు. అలా ఇప్పటి దాకా మొత్తం ఏడు పులులు అయ్యాయి. మార్కస్ ముగ్గురు పిల్లలు కూడా వాటితో ఎంచక్కా ఆడుకుంటూ ఉంటారు.

అవి ప్రపంచంలోనే ప్రమాదకరమైన జంతువులు అయుండచ్చు కానీ వాటికి మనం ప్రేమ చూపిస్తే అవి కూడా మనకు తిరిగి ప్రేమను పంచుతాయని మార్కస్ అంటూ ఉంటాడు. మార్కస్ కూతురు ఉయారాకు కూడా పులులు అంటే ఎటువంటి భయం లేదు. ఇక మార్కస్ మరో కూతురు నయారా అయితే టామ్ అనే పులితో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పరచుకుంది. టామ్ బరువు తగ్గించడం కోసం దానితో పాటూ ఈత కూడా కొడుతోంది. అయితే ఈ కుటుంబం వాటికి 40 ఎకరాల ఎకో-పార్క్ నిర్మించాలని అనుకుంటోంది. ఎందుకంటే వాటికి ఇళ్ళు సరిపోవడం లేదట.

https://www.facebook.com/BarcroftTV/videos/534483023604473/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here