సల్మాన్ ఖాన్ నాకు ఒక అమ్మాయి దొరికింది అని అన్నది ఈమెనే.. ఏమయ్యా సల్మాన్..!

సల్మాన్ ఖాన్ గురించి ఈరోజు సోషల్ మీడియాలో తెగ మాట్లాడేసుకున్నారు. అందుకు కారణం ఆయన చేసిన ట్వీట్..! ‘నాకు ఒక అమ్మాయి దొరికింది’ అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సల్మాన్ పెళ్లికి సంబంధించిందేనని అందరూ తెగ మాట్లాడేసుకున్నారు. అయితే ఆ ట్వీట్ వెనుక ఉన్న అసలు విషయం వేరే ఉంది.

సల్మాన్ ట్వీట్ చేసింది సినిమా హీరోయిన్ విషయమై.. ఎవరూ బాధపడకండి ఆయుష్ శర్మ హీరోగా రూపొందుతున్న లవ్ రాత్రి సినిమా కోసం హీరోయిన్ దొరికింది అని అనౌన్స్ చేశాడు. ఎవరూ వర్రీ అవ్వద్దు అంటూ అక్కడితో అతడి పెళ్ళి రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు. సల్మాన్ ఫోటో పెట్టిన అమ్మాయి పేరు వరీనా అట.. వరీనా హుస్సేన్ పూర్తీ పేరు..! న్యూయార్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సు చేసిందట. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఓకే చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here