పాకిస్థాన్ లో ఉంటున్న హిందూ రాజు.. అతని గురించి తెలుసుకోండి..!

పాకిస్థాన్ లో హిందువులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే.. అయితే అక్కడ ఒక రాజా కుటుంబం ఉంది అనీ.. ఒక రాజు అనే వాడు అక్కడ ఉన్నాడని చాలా మందికి తెలీదు. అతడికి సెక్యూరిటీగా పలువురు ముస్లింలు ఉంటారట. రాజ్ పుత్ వంశానికి చెందిన ఆ వ్యక్తి అక్కడ ఎంతో గౌరవంతో బ్రతుకుతూ ఉన్నాడు.

భారత్-పాకిస్థాన్ విడిపోయిన సమయంలో మన దేశ రాజులకు చెందిన చాలా భూభాగాలు పాకిస్థాన్ లో ఉండిపోయాయి. అయితే అక్కడికి వెళ్ళడానికి కొందరు రాజులు సంశయించారు.. మరికొందరు ఇంకా భారత్ లో చాలా ఆస్థి ఉంది కదా ఆ కొంచెం పోతే ఏముందిలే అని అనుకున్నారు. అయితే కర్ణి సింగ్ సోదా తాత చంద్ర సింగ్ సోదా మాత్రం పాకిస్థాన్ లోనే ఉండాలని అనుకున్నారు. చంద్ర సింగ్ పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక భూమికను పోషించారు. అలాగే ఆయన పాకిస్థాన్ హిందూ పార్టీని కూడా స్థాపించారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఫౌండర్ మెంబర్ గా కూడా ఉన్నారు. ఏడు సార్లు అక్కడి శాసనసభకు ఎన్నికయ్యారు. ఉమేర్ కోట్ లో ఆయనను ఎంతో గొప్ప వ్యక్తిగా భావిస్తారు.

ఆయన కొడుకు అయిన రాణా హమీర్ సింగ్ వారసుడే కర్ణి సింగ్ సోదా.. ఆయన రాజస్థాన్ కు చెందిన కనోటా రాజా వంశానికి చెందిన పద్మిని అనే యువతిని పెళ్ళి చేసుకున్నాడు. కర్ణి సింగ్ స్వతహాగా లాయర్ కూడానూ.. ఎల్.ఎల్.బి. హానర్స్ ను యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో చదివారు. ప్రస్తుతం వీరి పేరు మీద ఉన్న ఎన్నో ఎస్టేట్ లను కర్ణి సింగ్ సోదా చూసుకుంటూ ఉన్నారు. పాకిస్థాన్ ప్రజలు ఈ రాజవంశానికి ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తుంటాయి. పలువురు స్థానికులు ఈయనకు బాడీగార్డులుగా ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here