పూర్తయిన సినీ పెద్దల భేటీ.. కన్వీనర్ గా సుప్రియ నియామకం..!

తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధి కారులు, ఇతర శాఖల అధికారులు, సినీ ప్రముఖులతో నేడు సమావేశం అయ్యారు. సినీరంగంలో తలెత్తిన వివాదాలు, లైంగిక వేధింపుల ఆరోపణలపై చర్చించి అందుకు తగ్గ పరిష్కారం చూపుతూ చేసిన చర్చలు పూర్తయ్యాయి. పలు అంశాలు ఇందులో ప్రస్తావించారు.

Image result for talasani srinivas

ఈ భేటీ అనంతరం తెలుగు సినీ పరిశ్రమలోని సమస్యలపై కమిటీ ఏర్పాటైనట్లు ప్రకటించారు. యార్లగడ్డ సుప్రియను కన్వీనర్‌గా నియమించారు. ఈ కమిటీలో 24 విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. టాలీవుడ్‌కి సంబంధించిన విషయాలపై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై దుమారం చెలరేగుతోన్న నేపథ్యంలో క్యాష్ కమిటీ ఏర్పాటు ప్రక్రియ కూడా జరుగుతోంది. ఇందులో 21 మంది సభ్యులు ఉంటారు. వారిలో సగం మంది ప్రజా సంఘాలు, లాయర్లు ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here