పుత్రుడికి ప్రేమ‌తో..!

హైద‌రాబాద్‌: తండ్రి, కొడుకు మ‌ధ్య అనుబంధాన్ని కొల‌వ‌డానికి ఎలాంటి కొల‌మానాలూ లేవు. త‌న కుమారుడికి ఎలాంటి క‌ష్ట‌మొచ్చినా అండ‌గా ఉంటాడు తండ్రి. నాన్న గొడుగుగా మారిపోతాడు. అన్నివేళలా నీడగా నిలుస్తాడు, తోడుగా నడుస్తాడు, మనిషిగా మలుస్తాడు. స్నేహితుడిగా కుమారుణ్ని ప్రోత్స‌హిస్తాడు.

గంజి తాగే కుటుంబంలో అయినా, బెంజి కారులో తిరిగే కుటుంబంలో అయినా ఈ అనుబంధం మార‌దు. మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మ‌ధ్య అనుబంధాన్ని చాటి చెప్పే పిక్ ఇది. రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన లేటెస్ట్ మూవీ `రంగ‌స్థ‌లం` ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం విశాఖ‌ప‌ట్నానికి వెళ్తూ, దారి మ‌ధ్య‌లో త‌న కుమారుడికి ప్రేమ‌తో బ‌ర్గ‌ర్‌ను తినిపిస్తున్నారు మెగాస్టార్‌.

త‌న కుమారుడు, కోడ‌లు ఉపాస‌న, హీరోయిన్ స‌మంత‌, ద‌ర్శ‌కుడు సుకుమార్‌, ఇత‌ర టెక్నీషియ‌న్ల‌తో ఓ ప్ర‌త్యేక విమానంలో రంగ‌స్థ‌లం ప్రీ రిలీజ్‌కు విశాఖ‌ప‌ట్నానికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా విమానంలో తాను తినే బ‌ర్గ‌ర్‌ను కొడుకు నోటికి అందించాడు చిరంజీవి. ఉపాస‌న దీన్ని త‌న కెమెరాతో క్లిక్ మ‌నిపించారు. సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

https://twitter.com/upasanakonidela/status/975330385998548992

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here