పిల్ల‌లు ఎంత గొప్ప‌గా తీశారండీ ఈ సినిమా!

సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `మహానటి` సినిమాపై తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తోంది. మహానటి సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చిత్ర యూనిట్‌కు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా మెగా స్టార్‌ చిరంజీవి.. దర్శక నిర్మాతలను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా చిత్రం ఘనవిజయం సాధించినందుకు గానూ శుభాకాంక్షలు తెలియజేసిన చిరు.. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాతలు ప్రియాంక దత్‌, స్వప్నా దత్‌లకు శాలువాలు కప్పి సత్కరించారు. శుక్రవారం తమిళనాట నడిగయ్యార్‌ తిలగం పేరుతో రిలీజ్‌ అయిన మహానటికి అక్కడ కూడా సూపర్‌ హిట్ టాక్ వ‌చ్చింది. బ‌హుభాషా న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ ఈ సినిమాను ఆకాశానికెత్తేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here