చిరంజీవి జీవితంలో మరిచిపోలేని రోజు.. సురేఖతో పెళ్ళికి దారితీసిన కారణాలు.. ఆమె గొప్పతనం..!

మెగాస్టార్ చిరంజీవి జీవితంలో ఈరోజు మరిచిపోలేని రోజు. చిరు వివాహం జరిగి 38ఏళ్ళు గడిచిపోయింది. 1980 ఫిబ్రవరి 20న మద్రాస్ లో ఉదయం 10.50 గంటలకు చిరంజీవి వివాహం అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో జరిగింది. అదే రోజు 6 నుంచి 8 గంటల మధ్య రిసెప్షన్ కార్యక్రమం జరిగింది. వైవాహిక జీవితంలో ఎన్నో మధురస్మృతులు… ఎన్నో విజయాలను అందుకున్నారు చిరంజీవి.

చిరంజీవి, సురేఖల సంబంధం కుదిర్చింది “శంకరాభరణం” నిర్మాత ఏడిద నాగేశ్వరరావా? ఏడిద అభినందన సభలో చిరంజీవి స్వయంగా ఆ విషయం చెప్పారు. బాగా కష్టపడే గుణం ఉందని చిరంజీవి గురించి అల్లు రామలింగయ్యకు ఏడిద చెప్పారట. ఆ మాటలు విన్న అల్లు రామలింగయ్య అప్పటికే హీరోగా ఎదుగుతున్న చిరంజీవితో తన కూతురి పెళ్ళి చేశాడు. ఇక చిరంజీవి, సురేఖలది అన్యోన్య దాంపత్యం. చిరంజీవి సినిమాల్లో రఫ్ గానీ, ఇంట్లో చాలా సాఫ్ట్. సురేఖ అనుకూలవతి. మరిది పవన్ కల్యాణ్ కు కొడుకులా పెంచిన ఘనత ఆమెది. భర్త బాగోగులు చూసుకోవడంలో కూడా ఆమె ఎంతో అనుకూలవతి. ఫ్యామిలీకి పెద్ద కోడలిగా తనపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయని భావించిన సురేఖ అందరిని కలుపుకుని పోయేది. ఓ వైపు తన పిల్లలు, మరోవైపు తన ఆడపడుచులు, మరుదల బాగోగులు చూసుకునే తీరు ఎంతో గొప్పగా ఉంటుందని ఆమె గురించి తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు.

సురేఖ.. చిరు లైఫ్ లోకి వచ్చాక ఆయన దశ తిరిగింది. ఆమె వల్లే తనకు అదృష్టం కలిసి వచ్చిందని చిరు.. తన సన్నిహితుల వద్ద చెబుతుంటారు. తన జీవితంలో తనకు దేవుడు ఇచ్చిన రెండు వరాలు ఇచ్చాడని అని ఒకటి సినీ ఇండస్ట్రీలో హీరో కెరీర్, రెండు తనకు సురేఖ భార్య కావడం అని మెగాస్టార్ భావిస్తుంటారు. మరి ముఖ్యంగా చిరంజీవి పెళ్లినాటికి పవన్ కళ్యాణ్ చాలా చిన్నవాడని.. కాబట్టి ఆమె పవన్ కళ్యాణ్ ని కూడా తన కొడుకులనే చూసుకుంది. అందుకే ఆయన ఇప్పటికి తనని అన్నవదినలే దేవుళ్ళు అని పదే పదే గుర్తుచేసుకుంటూ ఉంటారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here