గొడ్డ‌లితో తండ్రి మెడ న‌రికాడు..ఫెవిక్విక్‌తో అతికించ‌బోయాడు!

ఆస్తిలో వాటా ఇవ్వ‌బోన‌ని క‌రాఖండిగా తేల్చేసినందుకు క‌న్న‌తండ్రిపై గొడ్డ‌లితో దాడి చేశాడో యువ‌కుడు. గొడ్డ‌లితో మెడను న‌రికేశాడు. తీవ్ర ర‌క్త‌స్రావం అవుతుండ‌టంతో భ‌య‌ప‌డిన అత‌ను ఫెవిక్విక్‌తో తెగిన భాగాన్ని అతికించే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని బ‌స్తీ జిల్లాలో చోటు చేసుకుంది.

బాధితుడి రామ్‌దేవ్‌ మిశ్రా. రైల్వే ఉద్యోగి. ఇటీవ‌లే ప‌ద‌వీ విర‌మ‌ణ చేశాడు. జిల్లా కేంద్రం బ‌స్తీలోని సోన్హా ప్రాంతంలో ద‌రియాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. అత‌నికి భార్య‌, కుమారుడు ఉన్నారు. కుమారుడి పేరు జ‌గ‌దీష్ మిశ్ర‌.

కొంత‌కాలంగా రామ్‌దేవ్ మిశ్రా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌దీష్ మిశ్రా ఆస్తి మొత్తాన్నీ త‌న పేరు మీద బ‌ద‌లాయించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. దీనికి ఆయ‌న అంగీక‌రించ‌లేదు. కొంత‌కాలంగా ఇద్ద‌రి మ‌ధ్యా ఈ విష‌యం మీద గొడ‌వ చెల‌రేగుతోంది.

శ‌నివారం కూడా ఇదే విష‌యంపై ఘ‌ర్ష‌ణ ప‌డ్డారు. దీనితో ఆగ్ర‌హానికి గురైన జ‌గ‌దీష్.. గొడ్డ‌లితో తండ్రిపై దాడి చేశాడు. మెడ న‌రికాడు. దీనితో తీవ్రంగా గాయ‌ప‌డ్డ రామ్‌దేవ్.. ర‌క్త‌పు మ‌డుగులో స్పృహ త‌ప్పాడు.

దీనితో తీవ్రంగా భ‌యానికి గురైన జ‌గ‌దీష్ మిశ్ర ఫెవిక్విక్ తీసుకుని తెగిన భాగాన్ని అతికించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. అదే స‌మ‌యంలో ఇంటికొచ్చిన అత‌ని త‌ల్లి ఈ దృశ్యాన్ని చూసి, వెంట‌నే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.

రామ్‌దేవ్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో రామ్‌దేవ్ చికిత్స పొందుతున్నారు. గొంతుపై ఫెవిక్విక్ ఆన‌వాళ్లు ఉన్నాయ‌ని డాక్ట‌ర్లు ధృవీక‌రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here