ఏడునెల‌ల చిన్నారిని భ‌గ‌భ‌గ‌మండే పొయ్యిలోకి విసిరేసిన త‌ల్లి

భువ‌నేశ్వ‌ర్‌: తానేం చేస్తున్నానో తెలియ‌ని మాన‌సిక స్థితి ఆ త‌ల్లిది. ఉయ్యాల‌లో నిద్ద‌రోతున్న ఏడునెల‌ల ప‌సిగుడ్డును భ‌గ‌భ‌గ‌మంటూ మండే పొయ్యిలోకి విసిరేసింది. ఒక్క‌సారిగా సెగ త‌గ‌ల‌డంతో దిక్కులు పిక్క‌టిల్లేలా కేక‌లు వేసిందా ప‌సిపాప. ఆ అరుపులు వింటూనే ఇంటి బ‌య‌ట ఉన్న ఆ పాప తండ్రి మెరుపులా లోనికి ప‌రుగెత్తుకొచ్చాడు.

 

పొయ్యి అంచుల్లో ప‌డున్న కుమార్తెను చూసి బిత్త‌ర‌పోయాడు. స‌కాలంలో ఆమెను ర‌క్షించాడు. భుజాల‌పై వేసుకుని ఆసుప‌త్రికి ప‌రుగెత్తాడు. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌లోని స‌లియా సాహి ప్రాంతంలో గురువారం ఉద‌యం చోటు చేసుకుంది. కాలిన గాయాల‌తో పాప‌కు మొద‌ట క్యాపిట‌ల్ ఆసుప‌త్రిలో చికిత్స అందించారు.

 

మెరుగైన వైద్యం కోసం శ్రీ‌రామ‌చంద్ర బాంజా వైద్య క‌ళాశాల, ఆసుప‌త్రికి త‌ర‌లించారు. శ‌రీరం అంతా క‌ట్టు కట్టారు. ఈ ఘ‌ట‌న‌పై న‌యాప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. పోలీసులు ఆ పాప త‌ల్లిదండ్రులిద్ద‌ర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. త‌ల్లి మాన‌సిక ప‌రిస్థితి బాగోలేద‌ని, అందుకే ఆమె అలా ప్ర‌వ‌ర్తించి ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here