లేడీ కానిస్టేబుళ్లే టార్గెట్‌! వీళ్ల దెబ్బ‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకుని మ‌రీ వెళ్లిపోయారు!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న‌ది ఓ న‌లుగురు స‌భ్యుల గ్యాంగ్‌. వారిలో ముగ్గురు అమ్మాయిలే. సైకిల్ గ్యాంగ్‌గా పేరుంది ఈ టీమ్‌కు. గ్యాంగ్ అనే ట్యాగ్ ఉంది క‌దాని వాళ్లేదో పొడిచేస్తార‌నుకుంటే పొర‌పాటే. వారి పేరు మీద ఎలాంటి క్రిమిన‌ల్ రికార్డులు లేవు. హ‌త్య‌లు, దోపిడీలు, దొంగ‌త‌నాలు అంత‌కంటే లేవు.

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌కు చెందిన ఈ గ్యాంగ్ అంటే టెర్రర్‌. ప‌గ‌లు ఎక్క‌డుంటారో తెలియ‌దు. ఏం చేస్తుంటారో అస్స‌లే తెలియ‌దు. రాత్రి 10 గంట‌ల త‌రువాత గులాబీ రంగు సైకిళ్లు వేసుకుని రోడ్డు మీదికి వ‌స్తారు. వ‌స్తూ, వ‌స్తూ త‌మ వెంట పెద్ద ఎత్తున మందు బాటిళ్లు, ఖాళీ సిగ‌రెట్ పాకెట్ల‌ను ప‌ట్టుకొస్తారు.

మీర‌ట్‌ మ‌హిళా పోలీస్‌స్టేష‌న్ ప‌రిస‌రాల‌కు వెళ్తారు. సిగ‌రెట్ పాకెట్లు, మందు బాటిళ్లు పోలీస్ స్టేష‌న్ కాంపౌండ్‌లో విసిరేస్తారు. మాయ‌మౌతారు. తెల్లారేస‌రికి స్టేష‌న్ కాంపౌండ్‌లో మ‌ద్యం సీసాలు, సిగ‌రెట్ పాకెట్లే. అవి ఎలా వ‌చ్చిప‌డుతున్నాయో మ‌హిళా పోలీసుల‌కు అర్థం అయ్యేది కాదు.

ఓ నెల రోజుల పాటు ఈ టెన్ష‌న్‌ను అనుభ‌వించారు వారు. కొంత‌మంది కానిస్టేబుళ్లు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకుని మ‌రీ వెళ్లిపోయారు. చివ‌రికి- ఈ గ్యాంగ్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. వారిని అరెస్టు చేశారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే.. న‌లుగురూ నాలుగు ర‌కాల క‌థ‌లు చెబుతున్నారు. ఏదీ వాస్త‌వం కాదు. వారిపై కేసు న‌మోదు చేశారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here