సెక్స్ రాకెట్‌: ఉపాధి పేరుతో మ‌సాజ్‌, స్పా సెంట‌ర్ల‌లో ఉద్యోగం..!

ప‌క్కా స‌మాచారం అంద‌డంతో ఓ వ్య‌భిచార గృహంపై దాడి చేశారు పోలీసులు. అక్క‌డ ఆరుమంది అమ్మాయిల‌ను అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ సంద‌ర్భంగా వారు చెప్పిన విష‌యాలు విని పోలీసులు కూడా బాధ‌ప‌డ్డారు.

కార‌ణం.. ఆ యువ‌తులంద‌రూ ఒకే ప్రాంతానికి చెందిన వారు. వారంద‌ర్నీ మూకుమ్మ‌డిగా మోసం చేశాడో ద‌ళారి. ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని న‌మ్మించి, వారి నుంచి వేల రూపాయ‌ల‌ను వ‌సూలు చేశాడు.

చివ‌రికి.. వారిని వ్య‌భిచార గృహానికి అమ్మేశాడ‌ట‌. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో చోటు చేసుకుంది. హైద‌రాబాద్ త‌ర‌హాలోనే మీర‌ట్‌లో కూడా స్పా, మ‌సాజ్ సెంట‌ర్ల ముసుగులో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న‌ట్లు ప‌క్కా స‌మాచారం అంద‌డంతో పోలీసులు దాడి చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆరుమంది యువ‌తుల‌ను అరెస్టు చేశారు. వారిని పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. వ్య‌భిచార గృహం నిర్వాహ‌కురాలిని క‌స్ట‌డీలోకి తీసుకున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పేద మ‌హిళ‌ల‌ను టార్గెట్‌గా చేసుకుని, వారికి ఉపాధి ఇప్పిస్తామ‌ని ఆశ‌చూపి, త‌మ‌ను మ‌సాజ్, స్పా సెంట‌ర్ల‌లో ప‌ని ఇప్పించార‌ని, ఆ త‌రువాత వ్య‌భిచార కూపంలోకి దింపార‌ని బాధిత యువతులు చెబుతున్నారు.

ఈ విష‌యాన్ని తెలుసుకున్న ఓ ఎన్జీవో ప్ర‌తినిధులు ఇచ్చిన ప‌క్కా స‌మాచారంతో పోలీసులు మీర‌ట్‌లోని బ్యూటీ అండ్ స్పా మ‌సాజ్ సెంట‌ర్‌పై దాడి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here