చెట్లను పెళ్ళి చేసుకుంటున్న మెక్సికో మహిళలు.. మగవాళ్ళు ఉన్నా కానీ..!

గత కొద్ది రోజులుగా మెక్సికోకు చెందిన మహిళలు చెట్లను పెళ్ళి చేసుకుంటూ ఉన్నారు. అలాగని మగవాళ్ళు అక్కడ లేరని కాదు..! అంతేకాదు తాము పెళ్ళి చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తూ వస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు అలా ఇప్పటికే చాలా మంది మహిళలు చెట్లను పెళ్ళి చేసుకుంటూ ఉన్నారు. అందుకు ముఖ్య కారణం వారికి చెట్ల మీద ఉన్న ప్రేమ మాత్రమే..!

శాన్ జకింటో అమిల్పాస్, ఓక్సాకా రాష్ట్రం లో ఇప్పటికే చెట్లను చాలా వరకూ నరికేశారు. ఇక మిగిలి ఉన్న చెట్లను కూడా ఎక్కడ నరికేస్తారో అని భావించిన ‘బెడానీ’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ ‘చెట్టును పెళ్ళి చేసుకో’ అనే ప్రోగ్రాంను మొదలుపెట్టింది. దీనికి స్పందించిన ఎంతో మంది మహిళలు వారు చెప్పినట్లే చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడడం కోసం తమ వంతు సాయంగా వారు ఈ పని చేస్తున్నారు. మొదట మహిళలు పెళ్ళి చేసుకోవడం మొదలు పెట్టారు.. అది చూసిన కొందరు మగవాళ్ళు కూడా చెట్లను తమ భార్యలుగా స్వీకరిస్తున్నారు. ఏది చేసినా చెట్లను కాపాడుకోడానికే అని స్వచ్ఛంద సంస్థ సభ్యులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here