సూర్యాస్త‌మ‌యంలో, పురాత‌న‌ స‌మాధిపై..తెల్ల‌రంగు దుస్తుల్లో..భీతిగొలిపేలా న‌వ్వుతూ!

మెక్సికో సిటీ: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న బ్యాక్‌గ్రౌండ్‌..ఓ స్మ‌శానం. అది కూర్చున్న‌ది కూడా ఓ స‌మాధిపైనే! కెమెరా ఎటు తిప్పితే.. అటు చూపులు సారిస్తూ, విచిత్ర శ‌బ్దం చేస్తూ, భీతిగొలిపేలా న‌వ్వుతూ క‌నిపిస్తోన్న‌ది అది ఓ బొమ్మ! దానికి స్థానికులు పెట్టుకున్న పేరు డెవిల్ టాయ్‌..సింపుల్‌గా చెప్పాలంటే దెయ్యం బొమ్మ‌. సినిమా ప‌రిభాష‌లో చెప్పాలంటే.. అమ్మో బొమ్మ‌.

మెక్సికో గ్జోచిమిల్కో న‌గ‌రంలోని ఓ శ్మ‌శానంలో ఇది క‌నిపించింది. అచ్చం ఓ ప‌సివాడిలాగే ప్ర‌వ‌ర్తించ‌డం ఈ బొమ్మ ప్ర‌త్యేక‌త‌. కెమెరా ఎటు త‌ప్పితే, ఆ వైపు త‌న చూపులు సారిస్తుంది. ఉద్దేశ‌పూర‌కంగానే ఈ బొమ్మ‌ను భ‌యంక‌రంగా త‌యారు చేశారు.

ఆ బొమ్మ ముంద‌రి పండ్ల స్థానంలో కోర‌లు ఉంచారు. హెయిర్‌స్ట‌యిల్ కూడా డిఫరెంట్‌గా చేశారు. బ్రెజిల్‌కు చెందిన ఓ మ‌హిళ ఈ బొమ్మ‌ను అలా తీర్చిదిద్దంద‌ని, ఓ స‌మాధిపై దీన్ని కూర్చోబెట్టి, వీడియో తీసింద‌ని చెబుతున్నారు. హాలీవుడ్ హార‌ర్ మూవీ చైల్డ్స్ ప్లేలోని బొమ్మ‌ను స్ఫూర్తిగా తీసుకుని దీన్ని త‌యారు చేశార‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here