ప్రపంచంలోనే అతిపెద్ద ఏవియేషన్ మిస్టరీ.. కనిపెడితే 445 కోట్లు..!

ప్రపంచంలోనే అతిపెద్ద ఏవియేషన్ మిస్టరీ అంటే.. మలేషియాకు చెందిన ఎంహెచ్‌ 370 ఫ్లైట్ ఆచూకీ దొరక్కపోవడమే చెబుతారు. మార్చి 8, 2014న హిందూ మహాసముద్రం మీదుగా వెళ్ళిన ఈ విమానం కనిపించకుండా పోయింది. 239మంది ప్రయాణీకులతో బోయింగ్ 777 విమానం కౌలాలంపూర్ నుండి బయలుదేరింది కానీ  బీజింగ్ చేరలేదు.

దీంతో అప్పటి నుండి ఆ విమాన శకలాల కోసం వెతుకుతూ ఉన్నారు. కొన్ని శకలాలు దొరికినప్పటికీ కూడానూ అవి ఈ విమానంవే అన్న క్లారిటీ లేదు. తాజాగా విమానం ఆచూకీని కనిపెట్టేందుకు అమెరికా కంపెనీతో మలేషియా ప్రభుత్వం కొత్త డీల్ ను కుదుర్చుకుంది. విమానం ఆచూకీని గుర్తిస్తే ఏకంగా 70 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 445 కోట్లు) ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఒకవేళ గుర్తించలేకపోతే చిల్లిగవ్వ కూడా ఇవ్వమని అధికారులు తేల్చి చెప్పారు.


గతంలో ఆస్ట్రేలియా కంపెనీ ఒకటి విమానం ఆచూకీని గుర్తించేందుకు ముందుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది. విమాన శకలాలను గుర్తించడంలో సదరు కంపెనీ విఫలమవడంతో జనవరి 2017లో ఈ ఆపరేషన్ ను ఆపేశారు. మలేషియా, చైనా, ఆస్ట్రేలియాలు కలిసి గతంలో ఈ ఆపరేషన్ ను నిర్వహించాయి. ఈసారి అయినా విమాన శకలాలు దొరుకుతాయో లేదో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here