పెళ్ల‌యిన తొలి గంట‌లోనే..మోకాళ్ల మీద కూర్చుని భార్య కాళ్లకు సేవ‌లు చేసిన మాజీ దేశాధ్య‌క్షుడు!

పెళ్ల‌యిన తొలి గంట‌లోనే..మోకాళ్ల మీద కూర్చుని భార్య కాళ్లకు సేవ‌లు చేసి, త‌న ప్రేమ‌ను చాటిన దేశాధ్య‌క్షుడు!
భార్య మీద ఎంత ప్రేమ లేక‌పోతే మాత్రం- పెళ్ల‌యిన గంట‌లోపే ఆమె కాళ్ల వ‌ద్ద కూర్చుని, సేవ‌లు చేస్తారు. భార్య విలాసంగా కుర్చీలో కాళ్లు జాపుకొని కూర్చుంటే.. భ‌ర్త గారు ఆమె కాలికి సాక్స్ ఏదో తొడిగించారు. మ‌రి! ఆ ఆద‌ర్శ దంప‌తులు ఎవ‌రు?

కాస్త నిశితంగా ప‌రిశీలిస్తే వారిని క‌నుక్కోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. వారే మాజీ అమెరికా అధ్య‌క్షుడు బారక్ ఒబామా, మిఛెల్లి ఒబామా. ఈ ఫొటోను మిఛెల్లి ఒబామా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 1992 అక్టోబ‌ర్ 3వ తేదీన వారి వివాహ‌మైంది.

పెళ్లై పాతికేళ్ల‌యిన‌ప్ప‌టికీ.. ఒక‌రి మీద ఒక‌రికి ప్రేమ ఎంత మాత్రం త‌గ్గ‌లేద‌ని మిఛెల్లి ఒబామా చెబుతున్నారు. త‌న భ‌ర్త‌ను పూర్తిగా అర్థం చేసుకోవ‌డం వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని ఆమె స్ప‌ష్టం చేస్తున్నారు. అదే స‌మయంలో- బార‌క్ ఒబామా కూడా ఓ బ్లాక్ అండ్ వైట్ పెళ్లి ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here