ఎన్ని సినిమాల్లో చూడలేదు.. పోలీసును చంపి పారిపోయిన పాకిస్థాన్ తీవ్రవాది..!

మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు.. జైలులో ఉన్న ఖైదీని బయట ఉన్న ఆసుపత్రికి తరలిస్తారు. అలా బయటకు వచ్చిన ఖైదీ పోలీసులను కొట్టి.. లేదా చంపి అక్కడి నుండి పారిపోతాడు. అచ్చం అలాంటి ఘటనే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో చోటుచేసుకుంది. అన్యాయంగా ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయాడు.

శ్రీనగర్‌లోని శ్రీ మహారాజా హరిసింగ్ ఆసుపత్రి వద్దకు వైద్య ప‌రీక్ష‌ల కోసం పాకిస్థాన్ ఖైదీ న‌వీద్‌తో పాటు ప‌లువురు ఖైదీల‌ను తీసుకొని వచ్చారు. ఇంతలో బయట నుండి ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఆ స‌మ‌యంలో ఖైదీ న‌వీద్ కూడా పోలీసుల నుంచి ఓ తుపాకీ లాక్కొని కాల్పుల‌కు పాల్ప‌డ్డాడు. దీంతో ఓ పోలీసు మరణించాడు. కాల్పుల స‌మ‌యంలో పాకిస్థాన్ ఖైదీ న‌వీద్ త‌ప్పించుకు పారిపోయాడ‌ని, గాలింపు కొన‌సాగుతోంద‌ని శ్రీన‌గ‌ర్ పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలు అయ్యాయని తెలుస్తోంది.

ఖైదీ నవీద్ లష్కరే తోయిబా వసీమ్ గ్రూప్ కు చెందినవాడు. గతంలో కూడా నవీద్ పలు తీవ్రవాద కార్యకలాపాలలో పాలుపంచుకున్నాడు. అరెస్ట్ అవ్వకముందు ఓ పోలీస్ ను చంపేశాడు నవీద్.. అంతేకాకుండా ఓ స్కూలు టీచర్ ను కూడా నవీద్ చంపినట్లు తెలుస్తోంది. 2014లో నవీద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here