బాలిక‌పై సామూహిక అత్యాచారం..గొంతుకోసి హ‌త్య‌!

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మ‌రో దారుణ ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది. తొమ్మిదేళ్ల బాలిక‌ను అప‌హ‌రించిన న‌లుగురు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు.. ఆమెపై అత్యాచారానికి తెగ‌బ‌డ్డారు. అనంత‌రం గొంతుకోసి దారుణంగా హ‌త‌మార్చారు.

 

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఛ‌త‌ర్‌పూర్ స‌మీపంలోని భురాపుఖ్ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతురాలి పేరు శివ్‌కుమారి. రాజేష్ పాల్ కుమార్తె. గ్రామంలో ఆయ‌న‌కు పొలం ఉంది. వారికి తోడుగా పొలానికి వెళ్లిందా బాలిక‌.

మధ్యాహ్నం భోజ‌నం తేవ‌డానికి ఒంట‌రిగా ఇంటికి వెళ్తుండ‌గా.. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెను అప‌హ‌రించారు. సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అనంత‌రం ఆమెను గొంతుకోసి హ‌త‌మార్చారు.

సాయంత్రం వ‌ర‌కూ త‌మ కుమార్తె జాడ తెలియ‌క పోవ‌డంతో తల్లిదండ్రులు, ఇత‌ర కుటుంబీకులు గాలించ‌గా.. స‌మీపంలోని అట‌వీ ప్రాంతంలో ఆ బాలిక మృత‌దేహం క‌నిపించింది. వెంట‌నే వారు గౌరిహార్ పోలీస్‌స్టేష‌న్‌కు స‌మాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి ఇంటికి 100 మీట‌ర్ల దూరంలోనే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here