ఇంటికెళ్తోన్న బాలిక‌పై దారి కాచి క‌త్తితో దాడి.. అత‌నెవ‌రో కాదు!

టైల‌రింగ్ షాప్‌లో ప‌ని ముగించుకుని ఇంటికి వెళ్తోన్న ఓ బాలిక‌పై క‌త్తితో దాడి చేశాడో యువ‌కుడు. ఆమెను పొడిచి చంపాడు. అత‌నెవ‌రో కాదు.. త‌న‌ను ప్రేమించాలంటూ వెంట‌ప‌డ్డ కిరాత‌కుడే.

త‌న ప్రేమ‌ను నిరాక‌రించినందుకు ఆ బాలిక‌ను వెంట‌ప‌డి మ‌రీ పొడిచి చంపాడు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని బలూగావ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న అన్న‌పూర్ణన‌గ‌ర్‌కు చెందిన ఆ దుర్మార్గుడి పేరు ఆర్ గోపి. అదే ప్రాంతానికి చెందిన ఓ మైన‌ర్ బాలిక‌ను ప్రేమించాడు. త‌న‌ను ప్రేమించాలంటూ వెంట‌ప‌డ్డాడు. వేధించాడు. ఆమె దీనికి అంగీక‌రించ‌లేదు.

దీనితో ఆమెను అంత‌మొందించాల‌ని అనుకున్నాడు. శ‌నివారం సాయంత్రం టైల‌రింగ్ షాప్‌లో ప‌ని ముగించుకుని ఇంటికి బ‌య‌లుదేరిన బాలికను మార్గ‌మ‌ధ్య‌లో అట‌కాయించాడు. క‌త్తితో పొడిచి పారిపోయాడు.

ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న ఆ బాలిక‌ను చూసిన స్థానికులు వెంట‌నే బెర్హంపూర్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ ఆమె క‌న్నుమూశారు.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించారు. రాత్రే అత‌ణ్ణి అరెస్టు చేశారు. రిమాండ్‌కు పంపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here