హైదరాబాద్ విజేత థియేటర్ లో.. నీళ్లు ఇస్తానంటూ బాలికను తీసుకొని వెళ్ళి..!

హైదరాబాద్ లోని బొరబండలో ఉన్న విజేత థియేటర్ లో ఓ బాలికను లైంగికంగా వేధించిన విషయం బయటకు వచ్చింది. అయితే ఈ విషయం బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే కొందరు రాజకీయ నాయకులు తమదైన స్టైల్ లో సెటిల్ మెంట్ చేయాలని ప్రయత్నించారు. అయితే అది కాస్తా బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఇంతకూ ఏమి జరిగిందంటే.. బోరబండలో ఉన్న ఈ థియేటర్ కు ఎదురుగా పెద్ద స్లమ్ ఉంది. అందులో దాదాపు రోజుకూలీలే నివసిస్తూ ఉంటారు. ఆ పూరి గుడిసెల్లో నివసించే బాలిక.. నీళ్ల కోసం రోజూ ఆ సినిమా హాల్ కు వెళ్లి అక్కడున్న పంపులో పట్టి తెచ్చుకుంటుంది. రోజులానే వెళ్లిన ఆ అమ్మాయిపై సినిమా హాల్ లో స్వీపర్ గా పనిచేస్తున్న ప్రశాంత్ ఆమెతో మాటా మాటా కలిపాడు. నీళ్లు ఇస్తానంటూ పార్కింగ్ సెల్లార్ కు తీసుకెళ్లి, లైంగికదాడి చేశాడు. ఆ తర్వాత ఆమె నోట్లో గుడ్డలు కుక్కి బాత్ రూములో పడేసి వెళ్లాడు. బాలిక ఇంటికి రాకపోయేసరికి థియేటరు మొత్తం వెతికారు. కానీ కనపడలేదు బాత్ రూములో చూస్తే స్పృహతప్పి పడివుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, కొందరు రాజకీయనాయకులు రంగంలోకి దిగి రాజీ ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. ఈలోగా విషయం మీడియాకు పొక్కడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here