తెల్ల‌వారు జామున గుడి త‌లుపులు తెరిచిన పూజారి..నంది విగ్ర‌హాన్ని చూసి ఉలిక్కిప‌డ్డాడు!

కిందటిరోజు రాత్రి య‌థావిథిగా ఆల‌య త‌లుపుల‌ను మూసి ఇంటికెళ్లాడు పూజారి. మ‌రుస‌టి రోజు తెల్ల‌వారు జామున గుడికొచ్చాడు. ఆల‌య త‌లుపుల‌ను తెరిచాడు.

గ‌ర్భ‌గుడిలోకి వెళ్ల‌బోతూ.. నంది విగ్ర‌హాన్ని చూసి, ఉలిక్కిప‌డ్డాడు. కింద‌టి రోజు రాత్రి గుడి తలుపులు మూసే స‌మ‌యానికి ఎలా ఉన్న‌దో.. అలా లేదు నంది విగ్ర‌హం.

నందీశ్వ‌రుడి విగ్ర‌హం ధ్వంస‌మై క‌నిపించింది. విగ్ర‌హం నుంచి త‌ల‌ను వేరు చేశారు. విగ్ర‌హాన్ని మ‌ధ్య‌లో కోసి వేశారు. వేరు చేసిన విగ్ర‌హం త‌ల మ‌ధ్య‌భాగంలోనూ కోసిన‌ట్టు ఆన‌వాళ్లు ఉన్నాయి.

వెంట‌నే ఆయ‌న పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. నంది విగ్ర‌హం కింద నిధులు ఉన్నాయ‌నే ఆశ‌తో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఈ దారుణానికి పాల్ప‌డి ఉంటార‌ని అనుమానిస్తున్నారు.

ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని బ‌ళ్లారి జిల్లాలో చోటు చేసుకుంది. బ‌ళ్లారి తాలూకా ప‌రిధిలో కుర‌గూడ ప‌ట్ట‌ణ శివార్ల‌లో ఉన్న వ‌జ్ర‌బండ బ‌స‌వేశ్వ‌ర ఆల‌యంలో గుప్త నిధులు ఉన్నాయ‌నే అనుమానంతో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు గ‌ప్‌చుప్‌గా త‌వ్వ‌కాలు చేప‌ట్టిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు. పూజారి ఫిర్యాదు మేర‌కు కుర‌గూడ పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here