ఆటోలో హ‌త్య చేసి, మృత‌దేహాన్ని గోనెసంచిలో చుట్టి, అదే ఆటోలో తీసుకెళ్తూ! అస‌లు కార‌ణం..

బెంగ‌ళూరు: సిలికాన్ సిటీగా పేరున్న బెంగ‌ళూరులో ప‌ట్ట‌ప‌గ‌లు దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆటోలో వెళ్తోన్న ఓ యువ‌కుడిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త‌మార్చారు. అత‌ను ప్ర‌యాణిస్తున్న ఆటోలోనే హ‌త్య చేసి, మృత‌దేహాన్ని గోనెసంచిలో చుట్టి, అదే ఆటోలో తీసుకెళ్లారు. బెంగ‌ళూరు కామాక్షిపాళ్య స‌మీపంలోని సుంక‌ద‌క‌ట్టె బ్రిడ్జి వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

హ‌తుడి పేరు కోటేశ్వ‌ర రావు ఆలియాస్ కోటి. ఓ అమ్మాయి విష‌యంలో కోటేశ్వ‌ర‌రావు కొద్దిరోజుల కింద‌ట సురేష్ అనే వ్య‌క్తితో గొడ‌వ ప‌డ్డాడ‌ని, అదే ఈ హ‌త్య‌కు దారి తీసి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

కోటేశ్వ‌ర‌రావును హ‌త్య చేయడానికి రెండు రోజుల నుంచీ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, చివ‌రికి- కామాక్షిపాళ్య స‌మీపంలో ఆటోలో వెళ్తూ ప్ర‌త్య‌ర్థుల చేతిలో హ‌త్య‌కు గుర‌య్యాడ‌ని అంటున్నారు. సురేష్ స్నేహితులు చంద్ర‌, కృష్ణ‌, ఆంటోని అనే ముగ్గురు యువ‌కులకు ఈ హ‌త్య‌లో ప్రమేయం ఉన్న‌ట్లు తేలింది. ఈ ఘ‌ట‌న‌పై కామాక్షిపాళ్య పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here