అందాల పోటీల ఫైనల్స్ లో ట్విస్ట్ ఇచ్చిన ఈ అమ్మాయి.. నిజం తెలిసి బాధపడ్డ యువకులు..!

ఓ అమ్మాయి అందాల పోటీలో పాల్గొంది. యువతకు బాగా కనెక్ట్ అయింది. అన్ని ఎలిమినేషన్ రౌండ్స్ పూర్తీ అయ్యాయి. ఇక గ్రాండ్ ఫినాలేలో ఆ అమ్మాయికే కిరీటం అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ అమ్మాయి షో నిర్వాహకులకు.. షో చూస్తున్న వాళ్ళకు షాక్ ఇచ్చింది. అదేమిటంటే తాను అమ్మాయినే కాను.. అబ్బాయిని అని..! ఇంకేముంది అందరికీ దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. 2018 మిస్‌ వర్చ్యువల్‌ కజకిస్తాన్‌ అందాల పోటీలో ఇదే చోటుచేసుకుంది.

ఫైనలిస్ట్ అయిన 22 ఏళ్ల అరినా తాను అసలు ఆడదాన్నే కాదని మగవాన్ని అని చెప్పేసి ఎంతో మంది యువకుల గుండెల్లో బాంబు పేల్చింది. ఓ రోజు తన ఫ్రెండ్స్‌ తో కాఫీ షాపులో కూర్చుని ఉండగా ఒకప్పుడు మహిళలు అంతర్గత సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారని, దీంతో ఉన్నత వ్యక్తిత్వంతో ఉండేవారని, ఆధునిక మహిళలు బాహ్యసౌందర్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, దీంతో వ్యక్తిత్వం కోల్పోయి, ట్రెండ్‌ ఎటు ఉంటే అటు పోతున్నారని అలాంటి వాళ్ళనే అందగత్తెలుగా గుర్తిస్తున్నారని అతడు చెప్పాడు. కావాలంటే నిరూపిస్తానని ఛాలెంజ్ చేశాడు. ఓ మేకప్‌ ఆర్టిస్టు సాయం తీసుకున్న అతడు అందమైన అరినాగా మారిపోయాడు. వర్చ్యువల్‌ కజకిస్తాన్‌ అందాల పోటీలో భాగంగా ఆన్‌ లైన్లో తన ఫొటోలను పెట్టడంతో ఫైనలిస్టుగా ఎంపికై సవాల్ లో నెగ్గాడు.

ఆ తర్వాత తాను అమ్మాయిని కాదని, తన పేరు కూడా అరినా కాదని చెబుతూ ఒక వీడియో పోస్టు చేసి తాను ఎందుకు ఇలా చేశానో చెప్పుకొచ్చాడు. అమ్మాయిలు బాహ్య సౌందర్యానికి విలువ ఇవ్వడం మానుకోవాలని హితవు పలికాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here